Pawan kalyan urges janasainiks to be vigilant on sand mining యుద్దం ప్రారంభమైందని జనసైనికులను అప్రమత్తం చేసిన పవన్

Pawan kalyan urges janasainiks to be vigilant on sand mining

Pawan Kalyan, JanaSena, YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, janasainiks, Sand crisis, sand mining, sand mining fight, English medium, reverse tendering, Andhra Pradesh, Politics

Jana Sena Chief Pawan Kalyan in a latest tweet had urges his party men and followers, who were called as janasainiks to be vigilant on sand crises in the state. He also said that the war on sand corruption has just started.

జనసైనికులరా.. అప్రమత్తం.. యుద్దం ఇప్పుడే ప్రారంభమైంది: పవన్ కల్యాణ్

Posted: 11/18/2019 12:17 PM IST
Pawan kalyan urges janasainiks to be vigilant on sand mining

జనసేన అధినేత పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనలో కేంద్రంలోని పెద్దలను కలుస్తూ బిజీగా వున్నా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతునే వున్న విషయం తెలిసిందే. గత మూడు రోజులుగా పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడిన ఆయన తన ట్వీట్టర్ ఖాతా ద్వారా ఎప్పటికప్పుడు తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే వున్నారు. ప్రధానంగా ఇసుక కొరత, మాతృబాష, జగన్ పాలనతో పాటూ పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. ఇవే అంశాలపై ఆయన విశాఖ తీరంలో లాంగ్ మార్చ్ నిర్వహిణ సందర్భంలోనూ ప్రస్తావించారు.

అయితే లాంగ్ మార్చ్ విజయవంతం కావడం. ఆ తరువాత ఆయన డిమాండ్లలో ఒక్కటైన బలవన్మరణానికి పాల్పడిన భవన నిర్మాణ రంగ కార్మికుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలను పరిహారంగా ఇవ్వాలన్నారు. అయితే అందుకు ప్రభుత్వం ఆ తరువాత రెండు రోజుల వ్యవధిలోనే ఆ డిమాండ్ ను అంగీకరిస్తూ.. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు అండగా వుంటామని హామీని ఇచ్చింది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ డిమాండ్లలో ప్రప్రధమమైన డిమాండ్ ఇసుక కొరతపై కూడా వైసీపీ ప్రభుత్వం తలొగ్గిందా.? అంటే ఔననే చెప్పాలి. ఈ విషయం పవన్ కల్యాణ్ తాజా ట్వీట్ తో స్పష్టమవుతోంది.

దీనిపై తాజాగా మళ్లీ స్పందించిన జనసేనాని.. మీడియాతో పాటూ అన్ని విపక్ష పార్టీల నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ సీఎం ఇసుక పాలసీ విషయంలో జరిగిన తప్పుల్ని గుర్తించారని చెప్పుకొచ్చారు. జనసేనాని తన ట్వీట్‌లో ‘50 మంది భవన నిర్మాణ కార్మికుల చావుకు కారణమైన.. 35 లక్షల మందికి ఉపాధి లేకుండా చేసిన.. ఇసుక పాలసీలోని తప్పుల్ని.. సీఎం జగన్ రెడ్డి గుర్తించేలా, తెలుసుకునేలా చేసినందుకు కారణమైన మీడియా, మిగిలిన రాజకీయ నేతలు, ఇతరులకు.. జనసేన తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం’ అని పవన్ కల్యాణ్ తన తాజా ట్వీట్ లో పేర్కోన్నారు.


పవన్ కల్యాణ్ ప్రతిపక్షాల పోరాటంతో జగన్ ఇసుక పాలసీలో జరిగిన తప్పుల్ని తెలుసుకున్నారని పవన్ పరోక్షంగా చెప్పారు. మరో ట్వీట్ లో జనసైనికుల్ని అప్రమత్తం చేస్తూ కీలక సూచన చేశారు. ‘ఇసుక అక్రమ తవ్వకాలపై ఓ కన్నేసి ఉంచాలని.. అలాగే ఇసుకలో జరిగే అవినీతిపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. యుద్ధం ఇప్పుడే ప్రారంభమైందని’ పేర్కోన్నారు. ఇసుక అక్రమాలపై, అధిక ధర విక్రయాలపై నిత్యం అప్రమత్తంగా వుండాలని పవన్ కల్యాన్ జనసైనికులకు పిలుపునిచ్చారు. తాజాగా ఏపీలో ఇసుక అక్రమాలపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నెంబర్ 14500ను ఏర్పాటైన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  JanaSena  YS Jagan Mohan Reddy  AP CM YS Jagan  Sand crisis  Andhra Pradesh  Politics  

Other Articles