అంతర్జాతీయ పురుషుల దినోత్సవం international-men-s-day

International men s day

men's day,19 November

international-men-s-day

పుడమిని మోసే ఓర్పు ఆడదానికి ఉంటె దాన్ని గుర్తించి హత్తుకున్న హృదయం మాత్రం “మగ మహా రాజు “ కే ఉంటుంది..

Posted: 11/19/2019 04:41 PM IST
International men s day

- రెండు  అక్షరాలా కలయిక బేధంతో మిగిలిన..

- ఒక అపురూప ప్రాణం విలువ..

- నేడు  తన ఉనికిని  తన ప్రాయంతో కలగలిసిన  జీవనానికిచ్చింది..

- ఆ బంధ ఉచ్చు కదలిక పై ..

- ఆధారపడియున్న ఎన్నో ప్రాణులు..

- వాటన్నిటిని అమితంగా లాలించి ఆదరించే  హృదయ భావనాకు నిలువెత్తు రూపం మగమహారాజులు..

- నామకరణం చేసినంత మాత్రానా మహరాజులా బతకలేరు..

- మదిలో ఎన్నో ఆలోచనలు.. మరెన్నో లోటుపాట్లు..  తమ రక్తబంధాల రక్షణకై..

- కదిలే కాలం బరువు..

- కొలిచే పరికరానికి తెలుస్తుంది..

- కానీ  కొలవలెనని ఈ   బాధల  నిట్టూర్పును చేసేదెవరు..

- మగమహారాజానే  అహంకార నెపం తో తిరుగాడే తత్త్వం..

- లాలించే అమ్మ.. ఆదరించే నాన్న.. ప్రేమించే ప్రేయసి.. ఆదుకున్నే సోదరుడు..భుజం తట్టి  పిలిచే మిత్రుల ముందు ఉండునా..

- కన్నతల్లి లాలనను ఎంతటి వీరుడైన కరగాల్సిందే కానీ తండ్రి ప్రేమ ముందు ఎంతటి తల్లి ఐన తల వంచాల్సిందే..

- అపార ధరిత్రి వెలుగులో ఊరేగే నవ నిత్య ప్రాయం వారిది..

- కన్నులకు దర్శమిచ్చే  ఆవేదనా ఆర్భాటాలకు  తావు..  లేక కదిలే స్వల్ప జీవనం వారిది..

- ప్రవహించే కడలి స్వరాన్ని ఎండమావి ఆలోచన వైపరీత్యాలను తమలోని  దాచుకున్నే  నిధి  స్వరూపులు..

- కలికాలం వైపరీత్య నడుమ తమ స్థిరత్వాన్ని కోల్పోయి ..

- తిరుగడుతున్నా  రెండక్షరాలా రూపానికి ..

- ఎన్నో బాధ్యతలు మరెన్నో లోటుపాట్లు..

- ప్రతిభింబించే జీవన రహదారి వెనుక కదలాడే  ఈ బాధల  వలయాన్ని..

- ఈ ఇరు కన్నులా జలం  వర్ణించలేవు..కనీసం గుర్తించలేవు..

- పుట్టిన పుట్టుక అధికారకంగా కొన్ని  బంధాలను  ప్రసాదించినట్లే.

- కొన్ని బాధ్యతలా ఎండమావి తరంగాలను కూడా ప్రాయం పెరిగే కొద్దీ అందిస్తుంది.

- వీటన్నింటి నడుమ  పయనించే జీవన ఆలాపనను..

- ఎత్తిచూపె వారే..కానీ ఒక మరు లోచించే యత్నం చేయరేన్నడు.. 

- ఒక పాత్రలో మెలగడానికే మనకు సమయం సరిపోదు కానీ. ఒక తండ్రిగా కుటుంబబాధ్యతను.. ఒక భర్తగ తన అర్దాంగి రక్షణను,ఆమె ఆలాపనను.. ఒక కొడుకుగా  కన్న ప్రేగు  స్వరాన్ని ..ఒక మిత్రుడుగా  తన ఆనందాన్ని..ఒక సోదరుడిగా తన సోదరి సోదరుల రక్షణను..

- అంతేకాక పలు ఉద్యోగా కార్యాలలో ముందుండి నడిపించే  చైతన్య మార్గ స్వరూపులు ఈ మగ  మహా రాజులే..

- తమ  స్థిరత్వాన్ని కోల్పోయి మనకు  ఆ స్థిరత్వాన్ని  అందించే వీరి మార్గ దీక్షకు వారే రారాజులు..

- కన్నీటి చురకే  భయపడుతుంది వారి దరి చేరడానికి.. అంత  ధైర్య సాహసోపేత  వైఖరితో..

- చుట్టూరా కదలాడుతున్నా పుడమి రంగాన్ని సువిశాలం చేస్తున్న వీరి  మనుగడకు .. ప్రాచీన కాలం నుండే ఒక పెద్ద  పీట  ఉంది..

- నేడు  వీరి ఆలోచనలు మారాయి..తన తండ్రి తన  పుత్రికకు  స్వేచ్ఛ ఇచ్చాడు కాని  ఇంకో  తండ్రి  పుత్రుడు ఆ  స్వేచ్ఛకు భంగం కలిగించగా  మరో  తండ్రి  బిడ్డ దీనికి న్యాయం చేసాడు.. ఇది నేటి -  మేటి మన కథ..

-ఒక యువకుడు తప్పువాడు అయితే ప్రతి ఒక యువకుడు కాదు.. వారిని అనవసరంగా నిందించే ముందు జ్ఞప్తికి తెచ్చుకోండి ఒక మరు మీ తండ్రిని,మీ భర్తను,మీ కుమారుడుని,మీ అభిమాన  కథానాయకుడిని,మీ ప్రియుడిని .. వారంతా వేరైతే వీలు కూడా వేరే కదా..  అనవసర ఆర్భాటాలకై  జ్వలించే కొందరి తరుణుల కార్యాలకై నలిగిపోతున్న నవ యుగ యువకులు..

- ఆలోచనలు మారితే చేతలు మారుతాయి.. చేతలు మారితే ఆలోచనలకే తావే లేదు..

- చివరగా  పుడమిని మోసే  భూమాత ఓర్పు ఆడదానికి ఎంత ఉంటుందో దాని గుర్తించి హత్తుకున్న హృదయం మాత్రం మగవారికి ఉంటుంది..

శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : men's day  19 November  

Other Articles