టీఎస్ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 48 రోజుల సమ్మెను ఇవాళ ముగింపు పడింది. విధుల్లో చేరడానికి తాము సిద్ధమంటూ ఆర్టీసీ జేఏసీ, కార్మికులు సంచలన నిర్ణయం ప్రకటించింది. జేఏసీ నిర్ణయంతో రాష్ట్రంలో ఇక బస్సులు యథేచ్ఛగా తిరిగే అవకాశం ఏర్పడింది. కార్మికులు విధుల్లో చేరడానికి.. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం సానుకూల వాతావరణ కల్పించాలని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి కోరారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నట్లు ఆయన తెలిపారు. బేషరతుగా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని.. విధుల్లో చేరిన కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆయన కోరారు. లేబర్ కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
కార్మికులు ఎలాంటి పత్రాలపై సంతకాలు చేయరని.. విధుల్లోకి వెళితే డ్యూటీ చార్టులపై మాత్రమే సంతకాలు చేస్తారని అశ్వత్థామ రెడ్డి తెలిపారు. జేఏసీ నాయకులు, విపక్ష నేతలతో సుదీర్ఘ చర్చల అనంతరం బుధవారం (నవంబర్ 20) సాయంత్రం ఆర్టీసీ సమ్మెపై ఆయన కీలక నిర్ణయం ప్రకటించారు. ప్రభుత్వం, యాజమాన్యం స్పందన తర్వాతే సమ్మెపై తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు. సమ్మె విరమిస్తున్నట్లు నేరుగా ప్రకటన చేయకున్నా.. విధుల్లో చేరడానికి సిద్ధమంటూ అదే అర్థం వచ్చేలా మాట్లాడారు.
48 రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం, కోర్టుల్లోనూ చుక్కెదురవడంతో కార్మికులు ఆందోళనకు గురయ్యారు. రెండు నెలలుగా జీతాలు లేకపోవడం కార్మికుల జీవితాలను ఆగమాగం చేసింది. గతంలో కూడబెట్టిన అరకొర సొమ్ములు కూడా సమ్మె కాలంలో కరిగిపోయాయి. నిత్యావసరాలు, పిల్లల చదువులు, వృద్ధ తల్లిదండ్రుల బాధ్యత, ఆస్పత్రి తదితర ఖర్చులు భారమై కార్మికులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. గత్యంతరం లేని పరిస్థితుల్లో కొంత మంది కార్మికులు రోజువారీ కూలీలుగా అవతారమెత్తారు. మరి కొంత మంది కులవృత్తులను నమ్ముకున్నారు.
ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెను కొనసాగించాలా వద్దా అనే అంశంపై కార్మిక సంఘాల నేతలు తీవ్ర మల్లగుల్లాలు పడ్డారు. హైకోర్టు తీర్పు అనంతరం ఆర్టీసీ కార్మిక సంఘాలు మంగళవారం విడివిడిగా కార్మికుల అభిప్రాయాలు సేకరించాయి. బుధవారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమైన ఆర్టీసీ జేఏసీ.. సమ్మె విరమణపై చర్చించి ఆ వెంటనే నిర్ణయం ప్రకటించింది. వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టిన నేపథ్యంలో సమ్మెను విరమించి విధుల్లో చేరడం ఉత్తమమని ఎక్కువ మంది కార్మికులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
గత 48 రోజులుగా సమ్మె చేసి, ఒక్క డిమాండ్‌కు కూడా ప్రభుత్వం అంగీకరించకపోయినా విధుల్లో చేరితే భవిష్యత్తులో కనీసం ఉద్యోగ భద్రత కూడా ఉండదని.. తాడోపేడో తేలేంత వరకు సమ్మె కొనసాగించాల్సిందేనని మరి కొంత మంది కార్మికులు అభిప్రాయపడినట్లు సమాచారం. అయితే తమ ప్రయత్నం తాము చేశామని, మరిన్ని రోజులు సమ్మె చేస్తే కార్మికులు జీవితాలు మరింత దిగజారుతాయని జేఏసీ నేతలు అభిప్రాయపడ్డారు. మొత్తం మీద ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమణకే సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో నెలన్నరగా రాష్ట్రంలో నెలకొన్న సందిగ్ధత తొలగిపోవడానికి అవకాశం ఏర్పడింది. ఇక ప్రభుత్వం ఆర్టీసీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more