Pawan urges KCR to take back RTC employees జేపీ, పవన్ కల్యాణ్ వినతులపై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో..

Govt likely to take rtc employees conditionallay cm kcr to review

Pawan Kalyan, JanaSena, TSRTC, RTC Strike, RTC Employees, RTC Joint Action Committee, TSRTC workers, KCR, Ashwathama Reddy, Telangana, YS Jagan Mohan Reddy, Mana Nudi Mana Nadi, AP CM YS Jagan, 350-A, Telugu language, English medium, Telugu medium, Mother Tongue, pawan kalyan twitter, pawan tweet attack on ycp, YSRCP, Andhra Pradesh, Politics

Jana Sena Party chief Pawan Kalyan has appealed to Chief Minsiter K Chandrashekhar Rao to allow the employees of TSRTC to join duty as the JAC has called off the strike.

జేపీ, పవన్ కల్యాణ్ వినతులపై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో..

Posted: 11/21/2019 02:58 PM IST
Govt likely to take rtc employees conditionallay cm kcr to review

ప్రభుత్వం తమను విధుల్లో చేర్చుకుంటే.. సమ్మను విరమిస్తామని నిన్న కీలక ప్రకటన చేసిన ఆర్టీసీ కార్మికుల జేఏసీ నేతలు గత్యంతర లేని పరిస్థితుల్లో ఇవాళ సమ్మెను కొనసాగిస్తున్నారు. కార్మికులు రాష్ట్ర పరిస్థితిని తెలుసుకుని విధుల్లో చేరేందుకు సంసిద్దత వ్యక్తం చేయడంతో.. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం ఎలా వుండబోతోందన్నది హాట్ టాపిక్ గా మారంది. ఈ క్రమంలో్ కేసీఆర్ ఆర్టీసీపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆర్టీసీ అంశమై హుజూర్ నగర్ ఉపఎన్నికల ఫలితాల రోజున స్పందించిన ఆయన.. ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా తెలిపారు.

ఆ తరువాత కూడా హైకోర్టు అదేశాల నేపథ్యంలో ప్రభుత్వం మరో పర్యాయం కార్మికులను విధుల్లో చేరాలని గడువు విధించింది. అయినా ఆ గడువులో కేవలం 400 మంది వరకు మాత్రమే విధుల్లో చేరారు. అయితే ఇదే ధోరణి మరోమారు కూడా ఉదయిస్తుందని, ఒక్క ఏడాది అగిన తరువాత మళ్లీ కార్మికులు విధులకు వీడ్కోలు పలికి సమ్మెను స్వాగతిస్తే పరిస్థితి ఏంటన్న విషయమై సీఎం కేసీఆర్ అలోచిస్తున్నారు. దీంతో ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలంటే వారికి పలు కండీషన్లు పెట్టనున్నారని సమాచారం.

అంతేకాదు ఈ కండీషన్ల్నింటినీ వారు లిఖితపూర్వకంగా అంగీకారం తెలపాల్సి వుంటుందని కూడా వార్తలు వినబడుతున్నాయి. ప్రతి కార్మికుడు లిఖితపూర్వకంగా షరతులను ఆమోదించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఇక నుంచి సమ్మె చేయబోమని, సమ్మె కాలానికి జీతం అడగబోమని, సంస్థను విలీనం చేయాలంటూ కోరబోమని, అదే సమయంలో ఆర్థిక పరమైన అంశాలను కూడా భవిష్యత్ లో అడగబోమనే విధంగా కండిషన్స్​ను రాష్ట్ర ప్రభుత్వం విధించనున్నట్లు తెలిసింది.

అయితే కార్మికులే సమ్మెను విరమించిన నేపథ్యంలో వారికి ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా విధుల్లో చేర్చుకోవాలని.. వారి భాధలను సానుభూతితో అర్థం చేసుకోవాలని ఇప్పటికే జయప్రకాష్ నారాయణ కోరారు. ఇక తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అదే విషయాన్ని కోరారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని, కార్మిక సంఘాల నేతలు ప్రకటించినందున వారి వినతిని మన్నించి కార్మికులపై సానుభూతితో ఎలాంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి చేర్చుకోవాలని తాను సీఎం కేసీఆర్ ను కోరుతున్నాని అన్నారు.

నలభై రోజులకి పైగా సమ్మెలో ఉన్న కార్మికులు తిరిగి విధులకు హాజరయ్యే క్రమంలో వారికి కుటుంబ పెద్దగా సీఎం తగిన భరోసా ఇస్తారని ఆశిస్తున్నానని అన్నారు. సీఎం కేసీఆర్ సానుకూల నిర్ణయంతో.. గత 50 రోజులుగా రాష్ట్రంలోని ప్రజలు పడుతున్న ఇబ్బందులకు కూడా తెరపడుతుందని అన్నారు. దీని ద్వారా ప్రజా రవాణా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాలక్రమేనా కార్మికుల సమస్యలను అర్థం చేసుకొని వాటిని పరిష్కరించాల్సిందిగా కోరుతున్నానని మరో ట్వీట్ చేశాడు పవన్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  JanaSena  TSRTC  RTC Strike  RTC Employees  KCR  RTC Joint Action Committee  Telangana  Politics  

Other Articles