తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ చరిత్రలో అత్యధిక రోజుల పాటు చేసిన సమ్మెను సైతం వదిలి మళ్లీ విధుల బాట పట్టాలని నిర్ణయం తీసుకున్నా.. వారికి ఢిపోల వద్ద వ్యతిరేక పరిణామాలే ఎదురయ్యాయి. రాష్ట్రంలోని అర్టీసీ ఢిఫోల వద్ద తాత్కాలిక కార్మికులను విధుల్లోకి రానీయకుండా అడ్డుకుంటారని భావించిన పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 144 సెక్షన్ ను అమలు చేసింది. దీంతో తాత్కాలిక ఆర్టీసీ సిబ్బందితోనే ఇవాళ కూడా విధులు నిర్వహిస్తున్నారు.
ఇక సుదీర్ఘకాలం సమ్మెబాట పట్టినా ప్రభుత్వం కరుణించకపోవడంతో.. తాము మళ్లీ విధుల్లోకి చేరుతామని వచ్చిన ఆర్టీసీ కార్మికులను కూడా పోలీసులు ఢిపోల వద్ద అడ్డుకున్నారు. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని.. ఢిపోల వద్ద ఆర్టీసీ యాజమాన్యం వారికి తెలియజేసింది. దీంతో తాము భేషరుతుగా సమ్మెను వదిలి వచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం కనికరించడం లేదని, హక్కుల సాధనకోసం ఉద్యమిస్తే.. తమను ప్రభుత్వ వ్యతిరేకులుగా పరిగణించాలని చూడటం భావ్యం కాదని ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు.
ఈ విషయంలో తెలివిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం.. కార్మికులను విధుల్లోకి తీసుకోబోమని ప్రభుత్వం నుంచి కాకుండా యాజమాన్యం నుంచి అదేశాలను ఇప్పిస్తోందని కార్మికులు అరోపిస్తున్నారు. న్యాయస్థానంలో అఫిడెవిట్లు వేయడం చేతకాని తాత్కాలిక ఎండీ సునీల్ శర్మ.. తమను విధుల్లోకి చేరవద్దని మాత్రం ఢిపో అధికారులకు అదేశాలను జారీ చేశారని కార్మికులు అరోపించారు. ఇక యాజమాన్యం అదేశాలతో విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికులను డిపోల వద్ద అధికారులు అడ్డుకుంటున్నారు.
విధుల్లోకి తీసుకోవాలని తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు, విధుల కోసం వస్తున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను ఆర్టీసీ కార్మికులు అడ్డుకుంటుండడంతో డిపోల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విధులకు ఆటంకం కలిగిస్తున్న కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాలలోని 9 డిపోలతోపాటు హైదరాబాద్‌లోని హయత్‌నగర్, జూబ్లీ బస్ డిపోల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసి 144 సెక్షన్ విధించారు. తాత్కాలిక కార్మికులను అడ్డుకుంటున్న వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more