YSRC MLA appears before inquiry panel తప్పుడు అరోపణలు చేస్తే పరువునష్టం దావా: శ్రీదేవి

Ysrc mla from tadikonda appears before inquiry panel

Sridevi, YSRCP, Shedule Caste, Christian, Election Commission, Legal Right Protection Forum, Santosh, Shravan Kumar, TDP, Andhra Pradesh, Politics

YSRC MLA from Tadikonda constituency in Guntur district Vundavalli Sridevi, who is facing probe into her caste status, appeared before the enquiry officer and submitted documents related to her caste. Sridevi won from Tadikonda SC reserved constituency.

విచారణ ప్యానెల్ ఎదుట హాజరైన ఎమ్మెల్యే శ్రీదేవి

Posted: 11/26/2019 05:21 PM IST
Ysrc mla from tadikonda appears before inquiry panel

గుంటూరు జిల్లా ఎన్నికల కమీషనర్ గా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్ తాటికొండ శ్రీదేవి హాజరయ్యారు. జిల్లాలోని తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై కులం విషయంలో రేగిన వివాదం చివరకు విచారణ కమిటీ ఏర్పాటుకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ తమ ఎదుట హాజరుకావాలని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ నోటీసులు జారీ చేసిన క్రమంలో ఆమె విచారణకు హాజరయ్యారు. తాను ఎస్సీ కులానికి చెందిన వ్యక్తినేనని.. ఇందుకు సంబంధించిన కుల ధృవీకరణ పత్రాలను కమిటీకి అందజేశానని చెప్పారు.

తనకు, తన కుటుంబ సభ్యులకు హిందూ మాదిగ కుల ధ్రువపత్రాలున్నాయని ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. తాను పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రాజధాని అమరావతిలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను బయటకు తీస్తున్నందుకే తనపై ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. ఎప్పుడు పిలిచినా హాజరవుతానని చెప్పారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానన్నారు.

అసలేం జరిగింది.? అన్న వివరాల్లోకి వెళ్తే ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఓ ఇంటర్వ్యూలో తాను క్రిస్టియన్ అని శ్రీదేవి చెప్పుకోవడం అసలు వివాదానికి దారి తీసింది. అమె క్రిస్టియన్ అని బాహాటంగా చెప్పుకున్న అంశాన్ని ప్రస్తావిస్తూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరపున సంతోష్ అనే వ్యక్తి.. అమె శాసనసభ సభ్యత్వాన్ని సవాలు చేస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేశారు. క్రిస్టియన్ అయిన శ్రీదేవికి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అర్హత లేదని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం... ఈ అంశంపై విచారణ జరపాలంటూ ఎన్నికల కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles