ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికిఅన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారని.. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి తాజాగా మరోమారు ఆయనను టార్గెట్ చేశారు. తెలంగాణలో రోడ్డు రవాణా సంస్థను నిర్వీర్యం చేసినట్టుగానే మిగతా వ్యవస్థలపై కూడా ఆయన కొరడా ఝుళిపించనున్నారని తెలుస్తోందని అమె పేర్కోన్నారు. రెవెన్యూ ఉద్యోగులతో పెట్టుకుంటే తన లోసుగులే బయటపడతాయని వెనకంజ వేసిన కేసీఆర్.. ఆర్టీసీతో తన కారుకు ఎలాంటి నష్టం లేదనే అహంకారపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో రాష్ట్ర ఉద్యోగులంతా జాగ్రత్తగా వుండాలని అమె సూచించారు.
ఈ మేరకు తన ఫేస్ బుక్ అకౌంట్ లో ఒక పోస్టు పెట్టారు. "ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆసరాగా చేసుకుని... మిగిలిన శాఖలకు చెందిన ఉద్యోగులపై కూడా పంజా విసరడానికి కెసిఆర్ ప్రభుత్వం సిద్ధమవుతోందన్న వాదన వినిపిస్తోంది. శాసనసభలో ప్రతిపక్షం లేకుండా చేసిన సీఎం దొరగారు... ఆర్టీసీ సమ్మె ను ఆసరాగా చేసుకుని తెలంగాణలోని ప్రభుత్వ శాఖలు అన్నిటినీ కల్వకుంట్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చ పోతున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం... దాని ద్వారా మొత్తం వ్యవస్థలను తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని అనుకోవడం కేసీఆర్ గారి వ్యూహంగా కనిపిస్తోంది.
ఆర్టీసీతో మొదలైన కెసిఆర్ ప్రభుత్వ అరాచకం, రెవెన్యూ శాఖకు కూడా విస్తరించి.. అక్కడినుంచి మిగిలిన శాఖలకు కూడా వ్యాపించబోతోందన్న అనుమానాలు తెలంగాణ ప్రజల్లో బలపడుతున్నాయి. సచివాలయం లేకుండా ప్రగతి భవన్ నుంచి ప్రభుత్వ కార్యకలాపాలను చక్కపెడుతున్న సీఎం దొరగారు.. అదే వ్యవస్థను ప్రభుత్వ శాఖల్లో కూడా అమలు చేయాలనుకోవడం దురదృష్టకరం. ఆర్టీసీ సమ్మెకు ప్రతిపక్షాలు బాధ్యత వహించాలని చేతులు దులుపుకున్న టిఆర్ఎస్ ప్రభుత్వం.. సమ్మె కారణంగా కార్మికుల ప్రాణాలు కోల్పోవడానికి కూడా ప్రతిపక్షాలు బాధ్యత వహించాలని వితండవాదం చేస్తోంది. కేసిఆర్ ప్రభుత్వ వాలకం చూస్తుంటే మెట్రో రైలు స్టేషన్ పెచ్చులు ఊడిపడి అమాయకురాలు ప్రాణాలు కోల్పోతే... దాని బాధ్యత కూడా ప్రతిపక్షాలదే అంటారేమో?
అంతేకాదు.. మొన్న ఓ లారీ డ్రైవర్ తాత్కాలిక ఆర్టీసీ డ్రైవర్ గా బస్సును దురుసుగా నడిపి ఓ ఐ.టి. ఉద్యోగి ప్రాణాలు తీసిన ఘటనకు కూడా ప్రతిపక్షాలే కారణమని ఆరోపిస్తారేమో? ఇవే కాదు, హైదరాబాద్లోని ఫ్లైఓవర్ పై నుంచి కారు కిందకి దూసుకువచ్చి ప్రాణాలు తీసిన ప్రమాదానికి కూడా ప్రతిపక్షాల కుట్రే కారణమని దొరగారు అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు! తన వైఫల్యాలను ప్రతిపక్షాల మీదకు నెట్టడం కెసిఆర్ గారికి కొత్తేమీ కాదు. చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు త్వరలోనే ఈ అరాచకానికి సరైన తీర్పుని సంఘటిత పోరాటాల ద్వారా తెలియచేస్తారని విశ్వసిస్తున్నాను" అని విజయశాంతి పేర్కోన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more