అగ్రరాజ్యం అమెరికాలోని చికాగో రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఇండో అమెరికన్ యువతిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో నిందితుడైన దుర్మార్గుడికి బెయిల్ మంజూరు చేయవద్దని వైద్య విద్యార్థిని తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని కోరుతున్నారు. వైద్యవిద్యార్థితో పాటు ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలోని మృతురాలి స్నేహితులు కూడా ఈ డిమాండ్ ను సమర్థిస్తున్నారు. ప్రశాంతంగా వుండే విశ్వవిద్యాలయంలోకి చొరబడి వచ్చిన అగంతకుడు.. అత్యంత దారుణంగా వైద్యవిద్యార్థినిపై చేసిన హైయకరమైన చర్యకు కఠిన శిక్షను విధించాలని కోరుతున్నారు.
ఈ కేసుకు సంబంధించిన నిందితుడి తరపున బెయిల్ పిటీషన్ దాఖలు కావడంతో దానిపై న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కుక్ కౌంటీ ప్రాసిక్యూటర్ జేమ్స్ మర్ఫీ మాట్లాడుతూ.. నిందితుడు నేరం చేసినట్టు అంగీకరించాడన్నారు. యూనివర్సిటీ క్యాంపస్ నుంచి పార్క్‌కు నడుచుకుంటూ వెళ్తున్న రూత్‌ను తుర్మాన్ పిలిచాడని, ఆమె నిందితుడితో మాట్లాడేందుకు నిరాకరించిందని.. దీంతో ఆగ్రహానికి గురైన నిందితుడు ఆమెను వెంబడించి గొంతు నులిమాడడంతో అమె అపస్మారక స్థితిలోకి వెళ్లిందని పేర్కోన్నారు. దీంతో అమెను కారులోని వెనుక సీట్లోకి తీసుకెళ్లి అమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని మర్ఫీ న్యాయస్థానానికి విన్నవించారు.
అయితే అమె అపస్మారక స్థితిలోకి జారుకోలేదని, నిందితుడు బలంగా రూత్ గొంతు నులమడంతో ఆమె చనిపోయిందని, ఆ విషయం తెలియక.. మృతిరాలిపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడని ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. రూత్ పోస్టుమార్టం నిర్వహించిన కుక్ కైంటీ ఇచ్చిన నివేదక అమె బలంగా గొంతు నులమడంతోనే మరణించిందని స్పష్టం చేస్తోందని తెలిపారు. అపరిచితుడు అర్థరాత్రి వేళ పిలిస్తే ఎవరు మాత్రం వారికి స్పందిస్తారని.. అదే పెద్ద నేరంగా అమాయకురాలైన వైద్యవిద్యార్థినిన హత్యచేయడం నిందితుడి నేరప్రవృత్తిని తెలియజేస్తోందని.. అతడికి బెయిలు ఇవ్వొద్దని కోర్టును అభ్యర్థించారు.
అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబం అమెరికాలోని ఇల్లినాయిస్ లో స్థిరపడగా, వారి కుమార్తె, యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ లో వైద్యవిద్యను అభ్యసిస్తోంది. అమె విశ్వవిద్యాలయం నుంచి ఇంటికి తిరిగిరాకపోవడంతో.. అందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అమె ఫోన్ ను ట్రేస్ చేయగా అది ఏకంగా అమె చదువుతున్న కాలేజీ వెనుకునున్న గ్యారాజ్ ఏరియాలో వున్నట్లు చూపింది. దీంతో అక్కడికి వెళ్లి అమెను వెతకగా అమె ఓ కారులోని వెనుక సీటులో విగతజీవిగా పడివుంది.
అమెపై లైంగికదాడికి పాల్పడి అనంతరం హత్య చేసినట్లు సీసీటీవీ ఫూటేజీని పరిశీలించిన పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న ఓ పాత నేరస్థుడిని అదుపులోకి తీసుకున్నారు. డొనాల్డ్ తుర్మన్ (26) అనే పాత నేరస్థుడు యువతిని అత్యాచారం చేసి హత్య చేశాడని అంగీకరించాడు. 2016లో ఓ మహిళ చేతిలోంచి ఐఫోన్ ను తస్కరించి.. దొంగలించిన కారులో పరారైన కేసులో డొనాల్డ్ తుర్మన్ దోషిగా తేలాడు. అయితే అతనికి ఆరేళ్ల శిక్ష విధించింది న్యాయస్థానం. కాగా పేరోల్ పై బయటకు వచ్చిన తుర్మన్.. ఈ యువతిని హత్యచేసినట్లు అంగీకరించాడు.
దీంతో అతనిపై హత్య, లైంగిక వేధింపుల కేసును నమోదు చేసిన పోలీసులు పేరోల్ రద్దు చేసి అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ వృత్తిని అభ్యసించి, ఎంతో మందికి వైద్యం చేయాలని భావించిన తమ విద్యార్థిని, ఇలా విగతజీవిగా కనిపించడం ఎంతో బాధాకరమని, ఆమె కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని వర్సిటీ చాన్స్‌లర్ మైఖేల్ డీ అమిరిడిస్ తెలిపారు. ఆమె మరణానికి సంతాపంగా, ఆమెకు ఇష్టమైన పసుపు రంగు రిబ్బన్లను మిగతా విద్యార్థినీ విద్యార్థులు క్యాంపస్ అంతటా ఎగురవేసి సంతాపం తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more