బీజేపీపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి అధికారంలోకి రాకుండా అడ్డుకుని, ప్రజాస్వామ్యాన్ని అణచివేయడానికి ఆ పార్టీ సిగ్గుమాలిన చర్యలకు ప్రయత్నించిందని సోనియా దుయ్యబట్టారు. దేశంలోని లాభాలబాటలో పయనించే పీఎస్యూలను కూడా ప్రధాని తన స్నేహితులకు కట్టబెడుతు దేశాన్ని అధోగతిపాలు చేస్తున్నారని అమె దుయ్యబట్టారు. నమ్మెదించిన పారిశ్రమిక ప్రగతిని బూచీలా చూపుతూ పబ్లిక్ సెక్టార్ యూనిట్లను స్నేహితులకు అమ్మేస్తున్నారని అమె ధ్వజమెత్తారు.
న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రసంగిస్తూ... మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీపై కూడా సోనియాగాంధీ విరుచుకుపడ్డారు. రాజ్యాంగం ప్రకారం నడవాల్సిన గవర్నర్.. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల సూచనలతో నడుచుకున్నారని.. ఇందులో ఎలాంటి సందేహానికి తావు లేదని అమె మండిపడ్డారు. గవర్నర్ కోశ్యారీ అనుసరించి విధానం తీవ్రంగా ఖండించదగినది విషయమని ఆమె అన్నారు. మహారాష్ట్రలో ఎన్నికల ముందు ఏర్పడిన కూటమి విచ్ఛిన్నం కావడానికి బీజేపీ అహంకారం, అతి విశ్వాసమే కారణమన్నారు.
మహావికాస్ అఘాడీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నించారు.. కానీ, సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో మోదీ-షా ప్రభుత్వం పూర్తిగా వెనక్కుతగ్గిందన్నారు. బీజేపీ దుర్మార్గపు చర్యలను అడ్డుకోవాలనే సంకల్పంతో మూడు పార్టీలు ఐక్యంగా పనిచేస్తాయని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మర్యాదపూర్వకంగా పతనమైందని, దేశం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను ఎలా అధిగమించాలో మోదీ- షా ద్వయానికి స్పష్టత లేదని ఆరోపించారు.
దేశం ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోతుందని, వృద్ధిరేటు మందగించి, నిరుద్యోగం పెరిగిపోయి, పెట్టుబడులు కూడా తగ్గిపోయాయని సోనియా ధ్వజమెత్తారు. రైతులు, వ్యాపారులు, చిన్న, మధ్యతరహా వ్యాపారవేత్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగరేటు పడిపోయిందని, ఎగుమతులు మందగించాయని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో ప్రజలపై తీవ్ర భారం పడుతోందని చెప్పారు.
సమస్యను పరిష్కరించడానికి బదులుగా మోడీ-షాలు గణాంకాలతో ప్రజలను మోసగించడంలో బిజీగా ఉన్నారని, వాస్తవాలను తెలియజేయడం లేదని సోనియా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ప్రభుత్వ రంగం కొంతమంది మోదీ అనుకూల వ్యాపారవేత్తలకు అమ్ముడయ్యే అవకాశం ఉందని, అదే జరిగితే ఆ సంస్థల్లో పనిచేసే వేలాది మంది కార్మికుల పరిస్థితేంటి? అని ప్రశ్నించారు. బ్యాంకుల్లో డిపాజిట్లపై సాధారణ కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని వ్యాఖ్యానించారు. రీజనల్ కాంప్రహెన్షివ్ ఎకనమిక్ పాలసీతోపాటు ఎన్ఆర్సీ, ఆర్టికల్ 370 రద్దుపై కూడా సోనియా విమర్శలు గుప్పించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more