police foil man suicide attempt at pragathi bhavan ప్రగతి భవన్ వద్ద భార్య బాధితుడి హల్ చల్.!

Police foil man suicide attempt at pragathi bhavan

pragathi bhavan, man, suicide attempt, police, acheyya, mariyamma, hyderabad, telangana, crime

Security at Telangana chief minister camp office and official residence Pragathi Bhavan foil a man suicide attempt. In their enqiry it has come to know that he is Acheyya a construction feild mesan, is being tourched by his wife. 35 years old bought a petrol bottle and attempted suicide.

ప్రగతి భవన్ వద్ద భార్య బాధితుడి హల్ చల్.!

Posted: 11/30/2019 10:32 AM IST
Police foil man suicide attempt at pragathi bhavan

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార నివాసం ప్రగతి భవన్ వద్ద కలకలం చోటు చేసుకుంది. తన భార్య తనను నిత్యం అవమానిస్తూ, తిడుతూ వేధిస్తోందని భార్యా బాధితుడు హల్ చల్ చేశాడు. తన భార్య వేధింపులను భరించలేనని ఇక తనకు మరణమే శరణమని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతనిపై నీళ్లు గుమ్మరించి.. భార్యబాధితుడ్ని ప్రయత్నాన్ని నిలువరించారు.

అనంతరం భార్య బాధితుడి వివరాలను తెలుసుకుని.. అతను ఎందుకిలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడన్న వివరాలను తెలుసుకున్నారు. వారి విచారణలో ఆత్మహత్యాయత్నం చేసిన 35 ఏళ్ల భార్యబాధితుడి పేరు అచ్చయ్య. తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. సోమాజిగూడలో మంజీరా గెస్ట్ హౌస్ కు సమీపంలో నివాసం ఉంటున్నాడు. తనకు ఉపాది ఒక్క రోజు లభిస్తే మరో రెండు రోజులు లభించడం లేదని, దీంతో తన ఆరుగురు సంతానాన్ని, భార్యను పోషించడం కష్టంగా మారిందని తెలిపాడు.

అయితే తన భార్య తన పరిస్థితని అర్థం చేసుకోకుండా.. తనను అవమానిస్తోందని తెలిపాడు. అయితే తన ఉపాధి లేకుండా తాను ఎక్కడి నుంచి డబ్బులు తేచ్చేది.. ఎలా సంసారాన్ని నడిపేది.. కూలీ దొరికతేనే ఏమైనా చేయగలను.. ఇవి అర్థం చేసుకోని భార్య మరియమ్మ నిత్యం తనను తిడుతూ, వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. వీటన్నింటిని భరించలేక, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలిపాడు. అనంతరం అచ్చయ్య భార్యను తీసుకొచ్చిన పోలీసులు... భార్యాభర్తలిద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చి, పంపించేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pragathi bhavan  man  suicide attempt  police  acheyya  mariyamma  hyderabad  telangana  crime  

Other Articles