NASA satellite finds crashed Vikram lander విక్రమ్ పై ఆశలు నిర్జీవం.. శిధిలాలు లభ్యం..

Nasa finds chandrayaan 2 vikram lander on moon credits chennai techie

NASA finds Vikram Lander, Vikram Lander Chandrayaan-2, Chandrayaan-2 lander, vikram, chandrayaan-2, nasa, Shanmuga Subramanian, Vikram Debris, Lunar south pole, Chennai-based techie, US space agency's images

A dark, prickly, haloed bloom is tattooed on a distant field of pock-marked desolation: the silent portrait of a thwarted dream. This arresting Nasa image, released on December 3, shows the precise spot on the Moon's surface where Vikram, the lander deployed in India's Chandrayaan-2 mission, hard-landed in early September.

నాసా ఫోటోతో విక్రమ్ పై ఆశలు నిర్జీవం.. శిధిలాలు లభ్యం..

Posted: 12/03/2019 12:01 PM IST
Nasa finds chandrayaan 2 vikram lander on moon credits chennai techie

భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాన్ -2 ప్రయోగం చివరిక్షణంలో విఫలం కావడంతో అసలు విక్రమ్ ఏమైందన్న ప్రశ్నలు తలెత్తాయి. కాగా, విక్రమ్ జాడ కనిపించకపోవడంతో.. గత మూడు నెలలుగా సజీవంగా వున్న శాస్త్రవేత్తలు, భారతీయుల ఆశలు ఇప్పుడు నిర్జీవమయ్యాయి. విక్రమ్ తో కేవలం సమాచార సాంకేతిక సంబంధాలు మాత్రమే తెగిపోయాయని.. అయితే విక్రమ్ మాత్రం తనలో ఇమిడివున్న సాంకేతికతో చంద్రుడిపై పరిస్థితులను అధ్యయనం చేస్తూ.. డాటానే సేకరిస్తుందని భారతీయులు భావించారు.

కాగా, విక్రమ్ ల్యాండింగ్ సమయంలో చంద్రుడి దక్షిణ ధ్రువంలో కూలిపోయిందని తాజాగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కనిపెట్టింది. ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-2లో భాగంగా విక్రమ్ ల్యాండర్ ను చంద్రుడిపైకి పంపితే, చివరి క్షణంలో సమాచారాలు తెగిపోయాయిన విషయం తెలిసిందే. అయితే విక్రమ్ కోసం అన్వేషణ సాగినా పక్షం రోజులకు ఓ సారి పగలు రేయి ఏర్పడే ఆ ప్రాంతంలో అలుముకున్న చీకటి కొంత అవరోదంగా తయారైంది. దీంతో విక్రమ్ జాడ కనుగొనడం కష్టంగా మారింది. అయితే నాసా స్పేస్ ఏజెన్సీ మాత్రం పగలు వుండే పక్షం రోజులు చంద్రుడి ఫోటోలను తీసింది.

నాసా తీసిన ఫోటోలను క్షుణ్ణంగా పరిశీలించిన చెన్నైకి చెందిన షణ్ముఖ సుబ్రహ్మణ్యం ఫోటోలలోని ఓ ప్రాంతంలో చిన్న బింధువంత కాంతి ఏర్పడటంతో దానిని నాసా దృష్టికి తీసుకెళ్లాడు. అవి విక్రమ్ శిధిలాలుగా గుర్తించారు. విక్రమ్ క్రాష్ కు గురికావడంతో ఆయా ప్రాంతంలో పలు చోట్ల చంద్రుడి ఉపరితలంలో మార్పులు కూడా సంభవించాయని చెప్పారు. ల్యాండర్ ను కనిపెట్టిన నాసా, ఆ ఫోటోలను విడుదల చేసింది. సెప్టెంబర్ 26న ఏ ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్ కూలిందో గుర్తించామని, లూనార్ రికొన్నైస్సాన్స్ ఆర్బిటర్ (LRO) ల్యాండర్‌ ను గుర్తించిందని నాసా పేర్కొంది. ల్యాండర్ నుంచి కొన్ని శకలాలు చిందరవందరగా పడ్డాయని, 24 చోట్ల ఈ శకలాలు కనిపిస్తున్నాయని వెల్లడించింది. దాదాపు ఒక కిలోమీటర్ పరిధిలో విక్రమ్ ల్యాండర్ శకలాలు ఉన్నాయని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles