ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శీతకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజునే అధికార, విపక్షాల మధ్య వేడిని రాజేస్తున్నాయి. సభ ప్రశ్నోత్తరాల సమయంలో అధికార-ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడిచింది. విద్యుత్ రంగంలో గోపాల్ రెడ్డి కమిటీ ఇచ్చిన నివేదికపై ఏం చర్యలు తీసుకున్నారంటూ ప్రభుత్వాన్ని టీడీపీ ప్రశ్నించింది. ఈ అంశమై అధికార విపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరగుతున్న క్రమంలో ఇదే అంశమై ఆనం రామనారయణ రెడ్డి మాట్లాడుతున్న సందర్భంలో ఆయన వ్యాఖ్యలతో సభలో అధికార పక్ష సభ్యులు నవ్వుకున్నారు. అంతేకాదు స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలతో నవ్వుకున్నారు.
గత ప్రభుత్వ హయాంలో పీపీఏలలో అవకతవకలు జరిగాయన్న అంశంలో చర్చ జరుగుతోంది. అయితే టీడీపీ హయాలో ఎలాంటి అవకతవకలు జరగలేదని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. పీపీఏలపై కమిటీలు వేసి గందరగోళం పరుస్తున్నారని.. ఈ ప్రభుత్వ విధానాల వల్ల పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆరు నెలలు ఏం చేశారని ప్రశ్నించారు. దీనిపై మంత్రి బుగ్గన సమాధానమిస్తూ.. కెబినెట్ సబ్ కమిటీ అన్నింటినీ పరిశీలిస్తోందని.. వాటిని తగు సమయంలో నివేదిక కూడా సమర్పిస్తోందని అన్నారు. గతంలో 15 రోజుల్లో 41 పీపీఏలు చేసుకున్నారని.. దీంతో డిస్కింలు కుప్పకూలే పరిస్థితికి చేరకున్నాయని అన్నారు. రూ.9వేల కోట్ల నుంచి రూ.29వేల కోట్లకు అప్పు తీసుకొచ్చారు అన్నారు.
ఆతర్వాత.. ఈ అంశంపై తమ నేత చంద్రబాబు మాట్లాడే అవకాశం ఇవ్వాలని టీడీపీ పట్టు పట్టింది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి కలగజేసుకొని ప్రశ్నోత్తరాల సమయంలో ఇలా సభను అడ్డుకొని, నిరసన అనడం సరికాదన్నారు.. సభా సంప్రదాయాలను పాటించాలన్నారు. ఇక అరాచక శక్తులన్న పదం వాడిన చంద్రబాబు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. చంద్రబాబు క్షమాపణ చెప్పాలని, లేకపోతే అరాచకశక్తులు అనే పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ను కోరారు.
తన సీటు మార్చాలని ఆనం స్పీకర్ను కోరారు. ప్రతిపక్ష నాయకుడే తన పక్కకు వచ్చి నిలబడితే, తాను ఏం మాట్లాడగలనని అన్నారు. చంద్రబాబును తట్టుకునేంత శక్తి తనకు లేదని చెప్పారు. చంద్రబాబు పక్క వరుస నుంచి తన సీటును మరో చోటుకు మార్చాలని కోరారు. దీంతో ఆనం వ్యాఖ్యలపై సభలో నవ్వులు పూసాయి. ఆనం వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి వెఎస్ జగన్ కూడా నవ్వుకున్నారు. ఆ తరువాత సభలో మళ్లీ హాట్ డిస్కషన్స్ కు తెర లేచింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more