Congress leads protests against Citizenship Bill రెండు దేశాల ప్రతిపాదనను తీసుకువచ్చిందే సవర్కర్..

Not congress vd savarkar bought proposal of two countries

Congress spokesperson, Manish Tiwari, BJP, Union Minister for Home Affairs, Amit Shah, Citizenship ammendment bill, CAB, Parliament, congress, vinayak damodhar savarkar, proposal of two countries, Hindu Maha Sabha Meeting, Parliament, Nation, Politics

Congress spokesperson Manish Tiwari took a dig at BJP, while talking on an Citizenship ammendment bill in parliament he said, it was not the congress, but vinayak damodhar savarkar who was the first person to bring the proposal of two countries in 1935 at Hindu Maha Sabha Meeting.

రెండు దేశాల ప్రతిపాదనను తీసుకువచ్చిందే సవర్కర్..

Posted: 12/10/2019 03:02 PM IST
Not congress vd savarkar bought proposal of two countries

స్వతంత్ర్యం వచ్చే క్రమంలో కాంగ్రెస్ దేశాన్ని మత ప్రాతిపదికన రెండుగా విభజించి వుండకపోయివుంటే ఇవాళ దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ఖండించారు. దేశ స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో రెండు దేశాల సిద్దాంతాన్ని తొలుత ప్రతిపాదించింది వినాయక్ దామోదర్ సావర్కరేనని ఆయన అన్నారు. దేశాన్ని మతప్రాతిపదికన విభజించారని కాంగ్రెస్ ను అప్రతిష్టపాలు చేసేందుకు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

1935లో అహ్మదాబాద్లో జరిగిన హిందూ మహాసభలో తొలుత రెండు దేశాల ప్రతిపాదనకు పునాది వేసింది వినాయక్ దామోదర్ సావర్కరేనని చెప్పారు. అమిత్ షా చెప్పినట్లు కాంగ్రెస్‌ కాదని అన్నారు. ఈ సందర్భంగా కేంద్రం తీసుకువస్తున్న పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. నూతనంగా తీసుకువస్తున్న ఈ సవరణ అధికరణ 14, 15, 25, 26ను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ కిత్రం రోజు అర్థరాత్రి ఆమోదం తెలుపగా, రాజ్యసభలో ఈ బిల్లు అమోదం పొందాల్సి వుంది.

అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో మతపరమైన పీడనకు గురై, శరణార్థులుగా మన దేశానికి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించడమే ఈ బిల్లు ముఖ్యోద్దేశమని అమిత్ షా తెలిపారు. ఈ బిల్లుపై సోమవారం లోక్‌సభలో సుదీర్ఘంగా ఏడుగంటల పాటు చర్చ కొనసాగింది. ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని, రాజ్యాంగ విరుద్ధమంటూ ప్రతిపక్షాలు లేవనెత్తిన సందేహాలన్నింటికీ అమిత్‌ షా వివరణ ఇచ్చారు. బిల్లుకు అనుకూలంగా 311 మంది, వ్యతిరేకంగా 80 మంది ఓటేయడంతో సభ ఆమోదం లభించింది. ఇదే సమయంలో దేశంలోకి వచ్చిన శరణార్థులను వేరుగా, చోరబాటుదారులను వేరుగా చూడాలని షా అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manish Tiwari  BJP  CAB  Amit Shah  congress  vinayak damodhar savarkar  two countries  Parliament  Nation  Politics  

Other Articles