దేశ పౌరసత్వ సవరణ బిల్లును వివాదాస్పదమైనదిగా పేర్కొంటూ అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా కమిషన్ (యూఎస్సీఐఆర్ఎఫ్) ప్రకటన చేయడాన్ని భారత్ తోసిపుచ్చింది. అమెరికా వాదన అసమంజసం, అవాస్తవమని ఆక్షేపించింది. పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందితే పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చే ముస్లిమేతర శరణార్ధులకు భారత పౌరసత్వం లభిస్తుంది. కాగా ఈ బిల్లు తప్పుడు దిశగా పయనించే ప్రమాదకర మలుపుగా యూఎస్సీఐఆర్ఎఫ్ అభివర్ణించింది. ఈ బిల్లును తీవ్రంగా పరిగణించిన కమీషన్ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది.
లోక్ సభలో అమిత్ షా ప్రవేశపెట్టిన బిల్లు పూర్తిగా మతపరమైనదిగా ఉందని కమిషన్ వ్యాఖ్యానించింది. కాగా, లోక్ సభలో అమోదం పోందిన బిల్లును త్వరలోనే పెద్దల సభలో కూడా ప్రవేశపెట్టనున్నారు. ఉభయసభల్లో ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే అమల్లోకి రావడమే తరువాయి. పార్లమెంట్ ఉభయసభల్లో బిల్లు అమోదం పోందినపక్షంలో.. దానిని ప్రవేశపెట్టిన హోంమంత్రి అమిత్ షా సహా ఇతర నేతలు, అధికారులపై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించాలని యూఎస్సీఐఆర్ఎఫ్ వ్యాఖ్యానించింది.
ఈ బిల్లుకు అమోదం లభిస్తే పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి వలస వచ్చి మన దేశంలో ఆశ్రయం పొందుతున్న హిందువులు, సిక్కులు, బౌద్దులు, జైనులు, క్రైస్తవులు, పార్సీలకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ బిల్లు ప్రకారం 2014 డిసెంబర్ 31కి ముందు మన దేశంలోకి వచ్చిన ఈ మతాలవారిని అక్రమ వలసదారులుగా గుర్తించరు. వారికి పౌరసత్వం కల్పించి భారతీయ పౌరులుగా గుర్తిస్తారు. అయితే, ఈ బిల్లు మత వివక్షను సూచిస్తోందని కొన్ని విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి.
కాగా అమెరికన్ కమిటీ అభ్యంతరాలను భారత్ తోసిపుచ్చుతూ మతపరమైన మైనారిటీ శరణార్ధుల కష్టాలను తొలగించడం, వారి కనీస మానవ హక్కులను గౌరవించేందుకే ఈ బిల్లు ఉద్దేశమని స్పష్టం చేసింది. పౌరసత్వ బిల్లు, ఎన్ఆర్సీల ద్వారా ఏ ఒక్కరి పౌరసత్వానికి విఘాతం కలగదని తెలిపింది. పౌరసత్వ విధానాలను క్రమబద్ధీకరించే హక్కు అమెరికా సహా ప్రతి దేశానికీ ఉంటుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more