టీడీపీ పార్టీ అగ్రనేతలను ప్రభుత్వం టార్గెట్ చేస్తోందా.? వర్షాకాలం ముగిసిన తరువాత కురిసిన అకాలవర్షాలకు కృష్ణ నది పరివాహిక ప్రాంతంలోని ఇళ్లు, పోలాలు నీట మునగిన సమయంలో ప్రభుత్వ అదేశాల మేరకు కొందరు నీటిపారుదల శాఖ సిబ్బంది డ్రోన్ లతో కృష్ణా కరకట్టపైనున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి పరిస్థితులను పర్యవేక్షించారని అరోపణలు ఎదుర్కోన్నారు. ఈ ఘటన జరిగి మూడు నెలలు కూడా తిరగకముందే.. తాజాగా ఇవాళ ఎమ్మెల్సీ నారా లోకేష్ కు అదే డ్రోన్ ల ప్రమాదం తృటిలో తప్పింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ్లి నుంచి పెరిగిన బస్సు చార్జీల పెంపును నిరసిస్తూ టీడీపీ అందోళన కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా బస్సును దిగి.. అసెంబ్లీకి పాదయాత్రగా వస్తుండగా ఆయన సమీపంలో ఓ డ్రోన్ కెమెరా కింద పడింది. ఆపరేటింగ్ లోపంతో విద్యుత్ తీగలకు తగిలి డ్రోన్ కెమెరా ఒక్కసారిగా కింద పడింది. దీంతో నారా లోకేష్‌తో పాటు.. ఆయన చుట్టూ ఉన్న ఎమ్మెల్సీలు కూడా ఉలిక్కిపడ్డారు. దీని ప్రయోగం ఎవరు చేశారు.. కావాలని ప్రయోగించారా.? లేక కాకతాళీయంగా జరిగిందా.? అన్న అంశమై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదిలావుండగా మంగళగిరి బస్టాండ్ వద్ద లోకేష్ నేతృత్వంలో టీడీపీ ఎమ్మెల్సీల నిరసన తెలిపారు. ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీలతో కలిసి మంగళగిరి నుంచి ఏపీ అసెంబ్లీ వరకూ బస్ లో లోకేష్ ప్రయాణించారు. పెంచిన ధరలు, పెరిగిన భారం గురించి ప్రయాణికులతో మాట్లాడి తెలుసుకున్నారు. 15 కిలోమీటర్లకు పెంచిన రేటు ప్రకారం ఛార్జీలు రూపాయిన్నర పెరగాలి కానీ ... ఐదు రూపాయిలు అధికంగా వసూలు చేస్తున్నారు అని లోకేష్ దృష్టికి ప్రయాణికులు తీసుకొచ్చారు.
పెంచిన బస్సు చార్జీల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రయాణికులపై సంవత్సరానికి రూ. 700 నుండి రూ.. 1000 కోట్ల భారం పడుతుందన్నారు. పెంచిన ఆర్టీసీ రేట్లు తగ్గించే వరకూ పోరాటం చేస్తామన్నారు. పెంచుకుంటూ పోతాం అని జగన్ చెబుతుంటే.. ప్రజలంతా సంక్షేమ కార్యక్రమాలు పెంచుతారు అనుకున్నారు. కానీ ఇసుక ధర, ఆర్టీసీ ధరలను ప్రభుత్వం పెంచుకుంటూ పోతొందని విమర్శించారు. త్వరలో విద్యుత్ ఛార్జీలు కూడా జగన్ సర్కార్ పేంచేస్తోందని చెప్పారు. ఆర్టీసీ ఛార్జీలు పెంపుపై ఆందోళన వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more