కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి. ఈ చట్టంపై పలు రాష్ట్రాల్లో నిరసనలు హింసాత్మక రూపం కూడా దాల్చాయి. క్రమంగా ఈ అందోళనలు దక్షిణాది రాష్ట్రాలకు కూడా పాకాయి. కర్ణాటకలో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. బెంగళూరు, మంగళూరులో ఆందోళనకారులు పలుచోట్ల టైర్లు మండిస్తూ నిరసనకు దిగారు. పౌరసత్వ సవరణ చట్టంతో పాటు జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల 144 సెక్షన్ విధించినప్పటికీ రోడ్లపైకి నిరసన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. కాగా బెంగళూరు టౌన్ హాల్ వద్దకు చేరుకున్న నిరసనకారులను.. నిలువరించి అక్కడి నుంచి పంపించేందుకు ఓ పోలీసు ఉన్నాతాధికారి చేసిన వినూత్న ప్రయత్నం నెట్టింల్లో వైరల్ గా మారడంతో పాటు అనేక మంది ప్రశంసలను కూడా అందుకుంది. ఇక ఇక్కడి విచిత్రమేమంటే. నిరసనకారులు హృదయాలను కూడా ఆయన చేసిన పని తాకింది. అంతే అంతా అతనితో పాటు మూడునాలుగు నిమిషాల పాటు వుండి.. ఆ తరువాత అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయారు.
ఇంతకీ ఆ పోలీసు ఉన్నతాధికారి ఎవరు.. ఎం చేశారంటే.. బెంగళూరు టౌన్ హాల్ వద్దకు చేరకున్న అందోళనకారులు అక్కడ పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ.. తమ చేతుల్లోని ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో అక్కడకు చేరుకున్న బెంగళూరు సెంట్రల్ డీసీపీ చేతన్ సింగ్ రాథోడ్ వారితో పబ్లిక్ అడ్రెస్ సిస్టం ద్వారా మాట్లాడారు. శాంతియుత నిరసనలో అరాచక, అసాంఘిక శక్తులు ప్రవేశిస్తే పరిస్థితి చేజారుతుందంటూ హెచ్చరించారు.
#WATCH Karnataka: DCP of Bengaluru(Central),Chetan Singh Rathore sings national anthem along with protesters present at the Town Hall in Bengaluru, when they were refusing to vacate the place. Protesters left peacefully after the national anthem was sung. #CitizenshipAmendmentAct pic.twitter.com/DLYsOw3UTP
— ANI (@ANI) December 19, 2019
అయినప్పటికీ ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లకపోవడంతో.. వారిని నచ్చజెప్పిన ఆయన తాను ఒక గీతాన్ని అలపిస్తానని, దానిని విన్న తరువాత అందరూ మౌనంగా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని కోరారు. అయితే ఆయన ఏం పాటను అలపిస్తారా.? అంటూ అందరూ వేచిచూస్తున్న తరుణంలో ఆయన ఏకంగా జాతీయ గీతాన్ని ఆలపించడం మొదలుపెట్టారు. దీంతో ఆయనతో పాటు గొంతు కలిపిన నిరసనకారులు.. జాతీయ గీతాన్ని అలపించారు. ఇక ఆలాపన పూర్తైన తరువాత ఒక్కొక్కరుగా ఆ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు.
ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డీసీపీ చేతన్ సింగ్ రాథోడ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ‘దేశంలోని చాలా చోట్ల.. ముఖ్యంగా ఢిల్లీలోని జామియా యూనివర్సిటీ విద్యార్థుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును మనం చూశాం. మరికొన్ని చోట్ల నిరసనకారులపై విరుచుకుపడ్డ పోలీసులను కూడా చూశాం. అయితే మీరు ఇందుకు భిన్నంగా ఆలోచించారు. ఎవరికీ హాని కలగకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించారు. మీకు సెల్యూట్ సార్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more