పదో తరగతి పరీక్షల తేదీ విడుదలైన నాటి నుంచి తాను ఎక్కడకు వెళ్లినా.. మార్గమధ్యంలో వున్న ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొంత సేపు అగి అక్కడి విద్యార్థులను పలకరించి వారితో మాట్లాడి.. వారి అక్షరజ్ఞానానికి పరీక్ష కూడా పెడుతున్నారు. పనిలో పనిగా అక్కడి ఉపాధ్యాయులను, ప్రధానోపాధ్యాయుడిని కూడా కాసింత ఘాటుగానే పలకరిస్తున్నారు. ఇదంతా చెప్పి చేస్తున్న తతంగమైతే కాదు కానీ.. చెప్పకుండానే ఆకస్మికంగా ఈ పనులకు శ్రీకారం చుడుతున్నారు మంత్రి హరీశ్ రావు.
రాష్ట్ర అమాత్యుడిగా ఇలాంటి పనులు చేయడంలో తప్పేంలేదు.. పరీక్షల నేపథ్యంలో ఇలాంటి అకస్మిక తనిఖీలు కొంతైనా విద్యార్థులకు మేలు చేస్తాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఆయన ఈ తనిఖీలను సంగారెడ్డిలో చేపట్టడమే చర్చనీయాంశంగా మారింది. సీనియర్ నాయకుడు జగ్గారెడ్డికి చెందిన సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో తనిఖీలు చేయడం ఆసక్తికరంగా మారింది. కందిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన మంత్రి.. కాసేపు ఉపాధ్యాయుడి అవతారమెత్తారు.
పదో తరగతి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. విద్యార్థులు తెలుగులో సరిగా పేర్లు రాయలేకపోవడం, ఎక్కాలు కూడా చెప్పలేకపోవడంతో ఉపాధ్యాయుల బోధన పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. పదో ఎక్కం రాకపోతే విద్యార్థులు పది ఎలా పాసవుతారు?ఈ పోటీ ప్రపంచంతో ఎలా పోటీ పడతారని అని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. పాఠశాలలో ఏం నేర్పిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం కంది శివారులో నూతనంగా నిర్మిస్తున్న తెరాస జిల్లా కార్యాలయ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. భవనాన్ని మరింత నాణ్యంగా నిర్మించాలని గుత్తేదారులకు సూచించారు.
ఇటీవల మంత్రి హరీశ్ రావు తూప్రాన్ పురపాలిక పరిధి అల్లాపూర్లోని గురుకుల పాఠశాలలో నిర్మించిన ధ్యాన మందిరం, అటల్ టింకరింగ్ ప్రయోగశాలను ప్రారంభించి విద్యార్థులతో మాట్లాడారు. పలువురు పదో తరగతి విద్యార్థులను మంత్రి పిలిచి ప్రిన్సిపల్ దత్తాత్రేయశర్మ పేరును తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో రాసి చూపాలని.. అదేవిధంగా 7, 13, 17వ ఎక్కాలను చెప్పాలని అడిగారు. వారు రాయలేకపోయారు.. చెప్పలేకపోయారు. దీంతో మంత్రి ఉపాధ్యాయులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more