Third Death at Sunburn Festival in Goa గోవా సన్ బర్న్ ఫెస్ట్ లో తెలంగాణవాసితో పాటు ముగ్గురు మృతి

Dark shadow over sunburn three die at goa fest

Goa Sunburn Party, Electronic Dance Music (EDM), Three Dead, Drugs, Govind Gawade, Sunburn festival, Vagator beach, Manohar Ajgaonkar, Local Culture, Kala Academy, Andhra Pradesh, Telangana, Bengaluru, Goa, Politics

Even as opposition parties hit out at the Goa government over the death of three tourists after collapsing at the Sunburn Electronic Dance Music (EDM) Festival, state Culture Minister Govind Gawade said no one forced people to attend the event.

గోవా సన్ బర్న్ ఫెస్ట్ లో విషాదం.. తెలంగాణవాసితో పాటు ముగ్గురు మృతి

Posted: 12/31/2019 12:29 PM IST
Dark shadow over sunburn three die at goa fest

నూతన సంవత్సర స్వాగత కార్యక్రమాల్లో భాగంగా గోవా ముస్తాబైంది. ఈ క్రమంలో నిర్వహించిన సన్ బర్న్ ఫెస్టివల్ లో దేశవ్యాప్తంగా ఎంతోమంది యువత ఇక్కడకు వచ్చి సంబరంలో పాల్గొన్నారు. ఇక రాత్రివేళ జరిగిన ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ కార్యక్రమంలో తొక్కిసలాట జరగడంతో అందులో ముగ్గురు యువకులు కిందపడి సృహ కోల్పోయారు. దీంతో వారిని హుటాహుటిన అసుపత్రికి తరలించగా వారు అప్పటికే మరణించారని వైద్యులు వెల్లడించారు. వీరిలో ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కాగా, ఒకరు మాత్రం కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

ఇద్దరి తెలుగువారిలో ఒకరు మన నగరానికి చెందిన వ్యక్తి కావడంతో ఘటనపై మృతుడి తండ్రి స్పందించారు. ఈ పెస్టివల్ కు వెళ్లిన తన కుమారుడు చనిపోయి ఉంటాడని కొత్తపేటకు చెందిన కార్తీక్ గౌడ్ అభిప్రాయపడ్డారు. న్యూ ఇయర్ సంబరాల్లో భాగంగా ఇటీవల గోవాలో సన్ బర్న్ ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ షో ఏర్పాటు  చేసిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో నగరానికి చెందిన సాయి ప్రసాద్ అనే యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కాగా... సంబరాల్లో భాగంగా గోవా వెళ్లిన కుమారుడు ఇంటికి శవమై రావడంతో అతని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

సాయిప్రసాద్‌, అతడి స్నేహితుడు చిన్నవెంకట్‌ ఎలకాట్రానిక్‌ డాన్స్‌ మ్యూజిక్‌ కార్యక్రమాన్ని వీక్షించేందుకు క్యూలో నిలబడి ఉండగా దుర్ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. తొక్కిసలాటలో కిందపడిపోయి సాయిప్రసాద్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందినట్లు తెలుస్తోంది. కలుపుగోలుగా ఉండే వ్యక్తి ఆకస్మికంగా దూరమయ్యాడని తండ్రి కార్తీక్‌గౌడ్‌ అన్నారు. కుటుంబానికి ఆసరాగా ఉండే చెట్టంత కొడుకు దూరం కావడం సాయిప్రసాద్‌ కుటుంబం షాక్ కు గురయిందని ఇరుగుపొరుగు వారు అభిప్రాయపడ్డారు. మూడేళ్ల క్రితం సాయిప్రసాద్‌ పెద్ద సోదరి మాధురి చనిపోయిందన్నారు. అతడి చిన్నక్క మంజరి అమెరికాలో ఉంటుందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Three Dead  Drugs  Sunburn festival  Local Culture  Vagator beach  Andhra Pradesh  Telangana  Bengaluru  Goa  Politics  

Other Articles