కొత్త సంవత్సరంలో టీవీ ప్రేక్షకులకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) కానుకను అందించింది. రూ. 160 చెల్లించే వినియోగదారులందరికీ, ఉచితంగా వచ్చే చానెళ్లను ఇవ్వాల్సిందేనని, అదనంగా 26 దూరదర్శన్ చానెళ్లను అందించాలని తెలిపింది. చానెళ్ల గరిష్ఠ ధర ప్రస్తుతం రూ. 19 ఉండగా, దాన్ని రూ. 12కు తగ్గించి వినియోగదారుడి లాభాన్ని చూకూర్చింది. అన్నీ వ్యాపారకోణంలోనే అలోచించే ట్రాయ్ ఈ సారి వినియోగదారుడి కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంది. దీంతో బుల్లితెర ప్రేక్షకుడికి 2020 నుంచి ఆనందం రెట్టింపు కానుంది.
ఒకటికి మించి ఒకే ఇంట్లో టీవీలుంటే కనుక, రెండో కనెక్షన్ కు 40 శాతం తక్కువ ధరను వసూలు చేయాలని పేర్కొంది. ఇదే సమయంలో 20 శాతానికిపైగా వీక్షకులుండే చానెళ్లకు క్యారియర్ ఫీజును వసూలు చేయవద్దని పేర్కొంది. దీంతో 20 శాతం మందికి పైగా ప్రేక్షకులు వున్న చానెళ్లకు లబ్ది చేకూరనుంది. ప్రస్తుతం గరిష్ఠ క్యారియర్ ఫీజు రూ. 4 లక్షలుగా ఉండగా, దాన్ని తగ్గిస్తున్నట్టు పేర్కొంది. కొత్త నిబంధనలు మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇక ఒక భాషకు చెందిన చానెళ్లన్నీ ఒకే వరసలో ఉండాలని అదేశాలు జారీ చేసింది.
ఒక చానెల్ కు ఒక నంబర్ కేటాయించిన తరువాత ఆ నంబర్ ను తరుచూ మార్చవద్దని, ఒకవేళ మార్చాలంటే ముందుగా ట్రాయ్ అనుమతి తప్పనిసరని మెలికపెట్టింది. దీంతో తప్పనిసరైతే తప్ప ఇక చానెల్ నెంబర్ మారడం కూడా జరగని పనే. కాగా, తాము చూసే చానెళ్లకే డబ్బు చెల్లించే విధంగా గతంలో తయారు చేసిన విధానం, రూపొందించిన నిబంధనలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ట్రాయ్ కొత్త ఆదేశాలు విడుదల చేసింది. ప్రస్తుతం దూరదర్శన్ చానెళ్లు కాకుండా కేవలం 100 ఉచిత చానెళ్లను మాత్రమే ప్రసారం చేస్తున్నాయి.
వంద ఉచిత చానెళ్ల తరువాత అందించే ప్రతీ 25 ఉచిత చానెళ్లకు రూ. 20ని అదనంగా వసూలు చేస్తున్నారు. మారిన నిబంధనల ప్రకారం, నెలకు రూ. 160 చెల్లించే వారందరికీ తమ వద్ద ఉన్న ఉచిత చానెళ్లను తప్పనిసరిగా సర్వీస్ ప్రొవైడర్లు ఇవ్వాల్సిందే. ఇక అలాకార్టే పేరుతో విడివిడిగా చానెళ్లను ఎంచుకుంటే మరింతగా వసూలు చేసే వీలుండదు. అలాకార్టేలో విడివిడిగా ఇచ్చే చానళ్ల ధర బొకే ధరకు ఒకటిన్నర రెట్లకు మించి ఉండరాదని ట్రాయ్ కొత్త నిబంధన విధించింది. దీంతో విడివిడిగా తీసుకుంటే, రూ. 60 వరకూ పడే ధర, బొకేగా కొనుగోలు చేస్తే, రూ. 30కే ఇస్తున్న కంపెనీల ఆటకు అడ్డుకట్ట పడనుంది.
అలాకార్టేలో ఉండే చానెల్ సగటు ధర, ఆ చానెల్ లోని సగటు ధరకు 3 రెట్లకు మించి ఉండకూడదన్న కొత్త నిబంధన అమలులోకి వచ్చింది. ఇక కొత్త విధానం ప్రకారం సవరించిన అలా కార్టె చానల్, బొకేల ధరలను జనవరి 15లోగా ప్రజల ముందుంచాలి. బ్రాడ్ కాస్టర్లు, ఈ నెలాఖరులోగా ఆపరేటర్లు విధిగా తమతమ వెబ్ సైట్లలో ఈ వివరాలను తెలియజేయాల్సి వుంటుంది. ఆపై కస్టమర్లు, తాము ఎంచుకునే చానెళ్లకు మాత్రమే డబ్బులు కట్టుకుని చూసే వెసులుబాటు లభిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more