Harish Rao Insulted in Tirumala ముక్కోటీ ఏకాదశి రోజున తిరుమలలో హరీశ్ రావుకు పరాభవం

Harish rao insulted in tirumala on vaikunta ekadasi

vaikuntha ekadasi, mukkoti Ekadasi, Harish Rao, TTD member, Damodar Rao, TTD Officials, Protocol, TTD Board, Yadagiri gutta, tirumala temple, balaji temple, lord venkateswara temple, Chilkur Temple, Vaishnava alayas, Vishnu Temples, Andhra pradesh, Telangana

TTD officials did not follow the Protocol for the Minister and he was deeply hurt with their behavior. Harish was very angry and refused to go for the Darshan. TTD Board Member and Harish Rao’s Relative, Damodar Rao pacified him and took him to the Darshan.

ముక్కోటీ ఏకాదశి రోజున తిరుమలలో హరీశ్ రావుకు పరాభవం

Posted: 01/06/2020 12:56 PM IST
Harish rao insulted in tirumala on vaikunta ekadasi

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు తిరుమలలో పరాభవం ఎదురైంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పలువురు తెలంగాణ మంత్రులు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. అయితే అందరికీ శ్రీవారి దర్శనం కల్పించడంలో సఫలీకృమైన టీటీడీ.. మంత్రి హరీష్ రావుకు మాత్రం ప్రోటోకాల్ ప్రకారం కల్పించాల్సిన మర్యాదను అందించలేకపోయింది. ఆలయ అధికారుల నిర్వాకంతో మనస్తాపానికి గురైన ఆయన స్వామివారి దర్శనానికి వెళ్లేందుకు కూడా నిరాకరించారు.

ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ రాష్ట్ర మంత్రిగా ఆయనకు లభించాల్సిన టీటీడీ ప్రొటోకాల్ ను కల్పించడంలో అధికారులు విఫలం అయ్యారు. అధికారుల తీరుతో మనస్తాపానికి గురైన హరీశ్ రావు స్వామి దర్శనానికి వెళ్లేందుకు నిరాకరించారు. విషయం తెలుసుకున్న టీటీడీ పాలకమండలి సభ్యుడు దామోదర్, హరీశ్ రావుకు సర్దిచెప్పారు. రద్దీ, వీఐపీల తాకిడి అధికంగా ఉండటంతో పాటు, హరీశ్ రాకపై పూర్తి సమాచారం లేనందునే అలా జరిగిందని వివరణ ఇచ్చారు. ఆపై హరీశ్ రావును దగ్గరుండి స్వామి దర్శనానికి తీసుకెళ్లారు.

అంతకుముందు తెల్లవారుజామున పలువురు ప్రముఖులు స్వామిని వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకున్నారు. ఈ తెల్లవారుజామున 2 గంటల సమయంలో ధనుర్మాస కైంకర్యాల అనంతరం వైకుంఠ ద్వారాలు తెరచుకోగా, 5 గంటల నుంచి సామాన్య భక్తులకు స్వామి దర్శనాన్ని కల్పిస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. కాగా, తెలంగాణ రాష్ట్ర నుంచి వచ్చిన మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, శ్రీనివాసగౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు స్వామి వారి దర్శనం చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles