IAF recruitment rally on Jan 16 ఇంటర్ పాసైతే చాలు ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు

Sangareddy air force job rally on jan 16 21

jobs, iaf jobs, central jobs, private jobs, govt jobs, fresher jobs, sarkari jobs, naukri jobs, IAF, IAF Recruitment 2019, IAF Recruitment, IAF Recruitment 2019 Apply Online, IAF Vacancy 2019, IAF Jobs 2019, IAF Notification 2019, Sangareddy, Collector M Hanumantha Rao, Airforce Rally, RTC officials

District Collector M Hanumantha Rao said the rally for the posts of police and technicians would be organised from January 16 to 21 at JNTU, Pulkal, in the Airforce Rally which would be held at Pulkal in January.

ఇంటర్ పాసైతే చాలు ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు

Posted: 01/10/2020 04:11 PM IST
Sangareddy air force job rally on jan 16 21

ఇంటర్ పాసౌతే ,చాలు. ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది ఐఏఎఫ్(ఇండియన్ ఎయిర్‌ఫోర్స్). ఇందుకు సంబంధించిన రిక్రూట్ మెంట్ ర్యాలీ సంగారెడ్డిలో జరగనుంది. ఈ ర్యాలీ ద్వారా ఎయిర్‌మెన్ గ్రూప్ వై-నాన్ టెక్నికల్ పోస్టుల్ని భర్తీ జరగనుంది. సంగారెడ్డిలోని సుల్తాన్ పూర్ లో ఉన్న జేఎన్‌టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రాంగణంలో ఈ నెల 16 వ తేదీ నుంచి 21 వరకు రిక్రూట్ మెంట్ ర్యాలీ జరుగుతుంది.
 
వివాహం కాని పురుష అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష పాసైనవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. సుమారు పది వేల మంది ఈ ర్యాలీకి వస్తారని అంచనా. అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష 50 శాతం మార్కులతో పాస్ కావాలి. ఇంగ్లీష్‌లో ఇంటర్ రెండు సంవత్సరాల్లో 50 శాతం మార్కులు ఉండాలి.
 
అభ్యర్థులు 2000 జనవరి 19 నుంచి 2004 జనవరి 1 మధ్య జన్మించినవారై ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. పోలీస్ ఉద్యోగానికి 175 సెంటీమీటర్ల ఎత్తు, ఆటో టెక్నీషియన్ కు 165 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, రాత పరీక్ష, అడాప్టబిలిటీ టెస్ట్ 1, అడాప్టబిలిటీ టెస్ట్ 2 ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
 
ఎంపికైన వారికి ఆరు నెలల నుంచి ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ కాలంలో స్టైఫండ్ ఇస్తారు. ఉద్యోగంలో చేరిన తర్వాత రూ. 21,700 ల వేతనం లభిస్తుంది. రిక్రూట్‌మెంట్ ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలను https://airmenselection.cdac.in/ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IAF Recruitment 2019  IAF Recruitment  IAF Vacancy 2019  IAF Jobs 2019  sarkari jobs  

Other Articles