ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక రాజధానిగా వున్న అమరావతిని వికేంద్రీకరించి.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందేలా మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేసే దిశగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముసాయిదా బిల్లును అమోదించిన అధికారపక్షానికి పెద్దల సభలో చుక్కెదురు కావడంతో.. శాసనమండలిని రద్దు చేసే దిశగా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే మండలి రద్దు అంశంలో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఈ విషయమై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు పలు అసక్తికర విషయాలను వెల్లడించారు.
శాసనమండలి రద్దు వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదని.. పెద్దల సభ రద్దు కావాలంటే దానికి కేంద్రం అమోదం కూడా కావాలని ఆయన చెప్పుకోచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేస్తూ కేవలం సిఫార్సును మాత్రమే చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి.. దానిని కేంద్రానికి పంపించడం వరకే చేయగలుగుతుందని, దీంతో పెద్దల సభ రద్దు కాదని, కేంద్రం ఆమోదం తరువాత రద్దు సాధ్యమవుతుందని ఆయన చెప్పుకోచ్చారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి అమోదించిన తరువాత.. రాష్ట్రపతి ముద్రవేసిన తరువాత సభ రద్దు అవుతుందని అన్నారు. ఈ మేరకు ఒక నోటిఫికేషన్ కూడా జారీ అవుతుందని తెలిపారు.
ఇప్పటికే రాష్ట్రాల నుంచి వచ్చిన అనేక తీర్మానాలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని యనమల గుర్తు చేస్తున్నారు. మండలి రద్దుకు కనీసం ఏడాది సమయమైనా పడుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి నోటిఫికేషన్ వచ్చే వరకూ మండలి కొనసాగుతుందని.. పనిచేస్తూనే ఉంటుందన్నారు. కాబట్టి మూడు రాజధానుల బిల్లుపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేసి.. తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. వాస్తవానికి ఆర్టికల్ 169 కింద మండలి రద్దుకు తీర్మానం ప్రతిపాదించి ఆమోదించాలంటే కచ్చితంగా ప్రతిపక్షం సభలో ఉండాలని.. ప్రతిపక్షం లేకపోవడం వల్లే గురువారం ఆ తీర్మానాన్ని ముందుకు తీసుకెళ్లలేదని చెప్పుకొచ్చారు.
ఇప్పటికిప్పుడు మండలిని రద్దు చేయాల్సిన అవసరం ఏంటని మాజీ మంత్రి ప్రశ్నించారు. మండలికి డబ్బుల ఖర్చు అంటున్నారని.. అసెంబ్లీ నడపడానికి ఏడాదికి రూ.150 కోట్లు అవుతాయని.. అసెంబ్లీని కూడా రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే లాయర్‌కు రూ.5 కోట్లు ఎలా ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. సెలెక్ట్ కమిటీ పరిధిలో ఉన్న బిల్లులకు ఆర్డినెన్సు ఇచ్చే అవకాశం ఉండదని యనమల స్పష్టం చేశారు. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more