Protests in Amaravati continues for 38th day అమరావతిలో 38వ రోజు కొనసాగుతున్న నిరసనలు

Protests in amaravati continues for 38th day against decentralisation of capital

YS Jagan, Amaravati, Amaravati JAC, Student Leaders, Farmers, Three Capitals, Mangalagiri, mandadam, Tulluru, Andhra Pradesh, Politics

The locals of Amaravati capital area conducted a huge rally opposing the Andhra Pradesh Governments decesion on three capitals bill and with the call from Amaravati Parirakshna Joint Action Committee (JAC), which is opposing the AP Decentralisation of Governance continues for the Thirty Eighth day.

అమరావతిలో 38వ రోజు కొనసాగుతున్న నిరసనలు

Posted: 01/24/2020 02:39 PM IST
Protests in amaravati continues for 38th day against decentralisation of capital

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన మూడు రాజధానుల బిల్లును మండలి చైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపుతూ నిర్ణయం తీసుకోవడంతో కొంత ఉపశమనం లభించినా.. అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా ప్రకటించేవరకు.. సాధించేవరకు తాము అందోళన కార్యక్రమాలను విరమించబోమని అమరావతి ప్రాంత రైతులు స్పష్టం చేశారు. మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా విద్యార్థి, యువజన ఐకాస నాయకులు నిరసన కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. దీంతో అమరావతి ప్రాంతంతో కొనసాగుతున్న ఆందోళనలు 38వ రోజుకు చేరాయి.

రాజధాని సాధించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. ‘ప్రాణాలైనా అర్పిస్తాం ... అమరావతిని సాధిస్తాం’ అంటూ మహిళలు, యువకులు నినాదాలు చేశారు. తుళ్లూరు, వెలగపూడి, మందడం గ్రామాల్లో ఉదయం 8గంటలకే మహిళలు, రైతులు పెద్ద ఎత్తున దీక్షా శిబిరాలకు చేరుకున్నారు. రాష్ట్ర అవసరాల కోసం తాము భూములిస్తే.. భూములను తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు రాజధానిని తరలిస్తోందని వారు అరోపించారు.

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు శాసనమండలి చైర్మన్ తన ప్రత్యేక అధికారాలతో సెలెక్ట్‌ కమిటీకి పంపటంపై వెలగపూడిలో మహిళలు పూజలు నిర్వహించారు. గ్రామ దేవత పోలేరమ్మ గుడి వద్ద పొంగళ్లు వండుకుని మొక్కులు తీర్చుకున్నారు. రాజధాని ఇక్కడే ఉండాలని, ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవాలని కోరారు. పేద రాష్ట్రం అని చెబుతున్న సీఎం రాజధాని కేసు వాదించేందుకు న్యాయవాదులకు రూ.5కోట్లు ఖర్చు చేయడం సరికాదన్నారు. రాజధాని రైతుల పోరును ఇంకా ఉద్ధృతం చేస్తామని తెలిపారు. రాజధాని నిరసననలు ప్రధాన మంత్రి మోదీ వరకు తీసుకెళ్తామని వెల్లడించారు.

మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని ప్రాంతం మంగళగిరిలో స్థానికులు భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలు, విద్యార్థులు పోటెత్తిన ఈ ర్యాలీలో నల్లజెండాలు పట్టుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. మూడు రాజధానులు వద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ ముద్దు అనే నినాదాలతో మంగళగిరి హోరెత్తింది. ఈ ర్యాలీలో కిలోమీటర్ల పొడవునా మహిళలు, విద్యార్థులు బారులు తీరి కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. 'తుగ్లక్ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎలా ఉద్యమిస్తున్నారో చూడండి' అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles