కరోనా వైరస్ సోకిందన్న వార్తల నేపథ్యంలో ఒక్కసారిగా తెలంగాణ మరీ ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ ప్రాంతంలో కలకలం రేగింది. అయితే అది కేవలం అనుమానాలు మాత్రమేనని, ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ బృందం చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలతో పాటు వైద్యులు కూడా ఊపిరి తీసుకున్నారు. అంతేకాదు తెలంగాణలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదన్న విషయాన్ని కేంద్ర వైద్యుల బృందం స్ఫష్టం చేసింది. కరోనా ప్రభావం కనిపిస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చిన వైద్యుల బృందం ఈరోజు ఫీవర్ ఆస్పత్రిని సందర్శించింది.
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకులు అనురాధతో కలిసి కేంద్ర వైద్య బృందం ఫీవర్ ఆస్పత్రిని సందర్శించింది. తాజాగా తెలంగాణలోనూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందన్న వార్తల నేపథ్యంలో అక్కడ రోగులకు కల్పిస్తున్న వైద్య సేవలు, వసతులపై వైద్య బృందం పరిశీలించింది. అనంతరం రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకులు అనురాధ మీడియాతో మాట్లాడారు. ఆస్పత్రిలో చేరినంత మాత్రాన కరోనా వైరస్ బారినపడినట్లు కాదని అన్నారు. విమానాశ్రయంలో స్క్రీనింగ్ ఏర్పాటు చేశామన్నారు.
ఫీవర్ ఆస్పత్రిలో ఇప్పుడున్న వసతులతో పాటు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ కి సూచించినట్లు అనురాధ తెలిపారు. కరోనా వైరస్ కు సంబంధించి చికిత్స అందించే విధానంపై ఫీవర్ ఆస్పత్రి వైద్యులకు సూచనలు చేసినట్లు చెప్పారు. త్వరలో కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రితో భేటీ అవుతామని పేర్కొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఎవరూ అసత్యాలను ప్రచారం చేసి ప్రజల ప్రశాంతతను దెబ్బతీయవద్దని అమె కోరారు.
ఇప్పుడున్న రోగులతోపాటు మంగళవారం మరో ముగ్గురు రోగులు ఆస్పత్రిలో చేరినట్లు ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ శంకర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ముగ్గురు రోగుల పరిస్థితి నిలకడగా ఉందన్నారు. హైదరాబాద్‌లో మొత్తం వంద పడకలతో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసినట్లు అశోక్ పేర్కొన్నారు. పరీక్షల నిమిత్తం పంపే రక్తనమూనాలను కొరియర్ ద్వారా పంపుతున్నట్లు చెప్పారు. కరోనా వైరస్‌కు సంబంధించి ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని సూపరింటెండెంట్ అశోక్ వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more