ఇంటి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలంటే చేయి తడపాల్సిందేనని తెలియని ఓ వ్యక్తి.. న్యాయస్థానానికి వెళ్లినా.. లాభం లేకపోయింది. లంచం ఇవ్వనిదే అడుగు ముందుకు పడదని తెలుసుకునే లోపు ఏకంగా తన ఇంటి వద్ద కాలనీలో అందరూ చూస్తుండగా.. తన సిబ్బందితో అక్కడకు వచ్చిన ఓ మహిళా అధికారిణి అతనిపై చెప్పుతో దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
ప్రభుత్వ అధికారులు అందులోనూ టౌన్ ప్లానింగ్ విభాగంలోని అధికారుల లంచాల బాగోతం ఎలాంటిదో.. లంచం కోసం వారు ఎంతటి స్థాయికైనా దిగజారుతారని మరోమారు నిరూపితమైంది. లంచం అడగడమే కాకుండా, ఎదురు తిరిగినందుకు ఓ మహిళా అధికారి చెప్పులతో దాడి చేసింది. విస్మయం కలిగించే ఈ ఘటన సికింద్రాబాద్లో చోటు చేసుకుంది. కంటోన్మెంట్ కు చెందిన దశరథరామి రెడ్డి అనే వ్యక్తి గత రెండేళ్లుగా ఇంటి నిర్మాణ అనుమతుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అయితే అధికారులు మాత్రం అనుమతులు ఇవ్వకుండా లంచం డిమాండ్ ఛేశారని ఆయన ఆరోపిస్తున్నాడు.
దీంతో విసుగెత్తిన ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించి.. ఇంటి నిర్మాణానికి అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయినా అధికారుల స్పందించలేదు సరికదా.. నిర్మాణ అనుమతులు కూడా మంజూరు చేయలేదు. అయితే కోర్టు ధిక్కారానికి పాల్పడిన అధికారులపై తాను పోరాటం చేయకుండా తన మానన తాను ఇంటి నిర్మాణం చేసుకున్నాడు. దీంతో విషయం తెలుసుకున్న అధికారులు గత పది రోజులుగా అతడ్ని తెగ ఇబ్బందులకు గురిచేశారని బాధితుడు చెప్పాడు. ఇక తాజాగా తన ఇంటి వద్ద పనులను పరిశీలించేందుకు మహిళా అధికారణితో పాటు సిబ్బంది వచ్చారు.
అనుమతులు లేకుండా ఇంటిని ఎందుకు నిర్మిస్తున్నారని ప్రశ్నించారు. న్యాయస్థానం అదేశించినా అనుమతులు మంజూరు చేయడం లేదని.. ఇప్పటికైనా అనుమతులు మంజూరు చేయాల్సిందిగా దశరథరామి రెడ్డి వారిని కోరాడు. ఈ క్రమంలో లంచం ఇవ్వనిదే అనుమతులు ఇవ్వడం లేదని.. మీరు అవినీతిపరులంటూ దశరథరామిరెడ్డి అధికారులపై ఫైర్ అయ్యాడు. దీంతో కోపోద్రిక్తురాలైన మహిళా అధికారిణి దశరథరామి రెడ్డిపై చెప్పు విసిరింది. అంతటితో ఆగకుండా మరో కాలికి వున్న చెప్పును చేత్తో పట్టుకుని అతడిపై దాడికి దిగింది.
అయితే జరిగిన ఘటనతో పాటు వీడియోలు కూడా సాక్ష్యంగా పెట్టినా.. పోలీసులు కూడా తనపై చెప్పుతో దాడి చేసిన అధికారిణిని వెనకేసుకువచ్చి.. తనపైనే కేసు వేశారని బాధితుడు వాపోయాడు. డబ్బుకు వున్న ప్రాధాన్యం తనకు తెలిసిందని, డబ్బులేకుండా నీతిగా బతకాలంటే కష్టమని అధికారులు నిరూపించారని అవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని దశరథరామిరెడ్డి కోరాడు. తాను లంచం ఇవ్వనని తెగేసి చెప్పానని.. వారిపై. ఏసీబీకి కూడా సమాచారం ఇచ్చానన్నారు. తన ఇంటి దగ్గరే తననే అధికారిణి చెప్పుతో కొట్టారని అయినా తనపైనే కేసు పెట్టారని అన్నారు.
తన ఇంటి నిర్మాణానికి ఎందుకు అనుమతులు ఇవ్వట్లేదో చెప్పాలంటే.. సమాధానం ఇవ్వట్లేదని అన్నారు. కాగా, బాధితుణ్ని మహిళా అధికారిణి చెప్పుతో కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘‘లంచం అడిగింది ఈ మేడమే.. అనుమతి కోసం ఇంకా నువ్వు పదేళ్లు తిరగాలి చెప్పింది. మీరనలేదా మేడమ్.. దేవుడి మీద ఒట్టేసి చెప్పండి’’ అని అరుస్తూ దశరథరామి రెడ్డి అక్కడున్న అందరికీ చెప్పాడు. దీనిపై ఆగ్రహించిన అధికారిణి.. చెప్పు తీసుకొని కొడతా.. నన్నే లంచం అడిగానని అంటావా..హౌ డేర్ యూ’’ అని ఆవేశంతో ఊగిపోతూ చెప్పులతో బాధితుడిపై దాడి చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more