Swara Bhaskar angry at Padma Shri being given to Pakistani ‘‘పాకిస్తానీకి పద్మశ్రీ’’ బీజేపిని టార్గెట్ చేసిన నటి..

You abuse anti caa protesters while award padma shri to pakistani swara bhaskar attacks bjp

urban naxals, Prime Minister Modi, students, intellectuals, CAA Protest, NRC protests, Swara Bhaskar, BJP, Centre, Padma Shree, Adnan Sami, Save the Constitution, Save the Country, Indore, Madhya Pradesh, Politics, Crime

Bhaskar said the government seems to have ‘fallen in love with Pakistan. It sees Pakistan everywhere. My devout grandmother doesn’t chant Hanuman Chalisa as often as this government keeps chanting the Pakistan mantra.’

‘‘పాకిస్తాన్ తో ప్రేమలో పడ్డ బీజేపి’’ నటి విమర్శలు..

Posted: 02/03/2020 04:18 PM IST
You abuse anti caa protesters while award padma shri to pakistani swara bhaskar attacks bjp

పౌరసత్వ సవరణ చట్టం. జాతీయ పౌర గణనను విభేధిస్తూ గత రెండు నెలలుగా దేశరాజధాని హస్తినతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అందోళనలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలో సీఏఏ, ఎన్ఆర్సీలను వ్యతిరేకించిన భారతీయులను అవమానపరిస్తున్న మరోవైపు పాకిస్థానీయులకు మాత్రం ఏకంగా పద్మశ్రీ పురస్కారాలను అందించడంపై నటి స్వర భారత్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలోని అధికారంలో వున్న బీజేపిని టార్గెట్ చేసుకున్న అమె.. బీజేపికి పాకిస్థాన్ తో ప్రేమలో పడిందని వ్యంగోక్తులు విసిరారు.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో రాజ్యంగాన్ని రక్షిద్దాం.. దేశాన్ని పరిరక్షించుకుందాం.. అన్న పేరుతో పెద్ద ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పాల్గోన్న నటి స్వర భాస్కర్ ఇండోర్ వేదిక నుంచి కేంద్రాంపై విమర్శలు గుప్పించింది. పాకిస్థాన్ కు చెందిన అద్నాన్ సమీ 2016లో దేశ పౌరసత్వం ఇచ్చిన బీజేపి సర్కార్.. తాజాగా ఆయనను పద్మశ్రీ పురస్కారం అందించి సత్కరించిందని అన్నారు. దీంతో పాకిస్థాన్ తో బీజేపి ఎంత ప్రేమలో పడిందో దేశ ప్రజలు ఇట్టే అర్థం చేసుకోగలుగుతారని అన్నారు. అంతేకాదు దేశ రాజ్యాంగానికి కేంద్రంలోని బీజేపి సర్కార్ తూట్లు పోడుస్తుందని అన్నారు.

శరణార్థులకు పౌరసత్వం కల్పించడం, చోరబాటు దారులను అరెస్టు చేయడం దేశంలో ఎప్పటి నుంచో కొనసాగుతూనే వుందని అన్నారు. మీరు అద్నాన్ సమీకి దే పౌరసత్వం అందించి, పద్మశ్రీ కేటాయించడంతో సీఏఏ, ఎన్ఆర్సీల అవసరమేముందని అమె ప్రశ్నించారు. వీటిని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన చేస్తున్న భారతీయులపై దాడి చేస్తూ.. అవమానిస్తూ.. లాఠీ చార్జీలు చేస్తూ, చెంపలు వాయిస్తూ, టియర్ గ్యాస్ ప్రయోగిస్తూ అందోలనకారులను అర్బన్ నక్సలైట్లుగా గుర్తిస్తూ ఎందుకు ముద్రవేస్తున్నారని అమె ప్రశ్నించారు.

తమ ఇస్టానుసారం నిరసనకారులను తుక్డే.. తుక్డే గ్యాంగ్ అని దేశ ద్రోహులని కూడా ముద్రవేస్తున్నారని అన్నారు. ఇక పాకిస్థాన్ తో ఎంత లోతు ప్రేమలో వీరు వున్నారంటే.. మా ఇంట్లో మా బామ్మ ప్రతి నిత్యం హనుమాన్ చాలిసాను చదువుతుంటారు. అయితే అమె కంటే అధికంగా ప్రభుత్వ పెద్దలు పాకిస్థాన్ నామస్మరణ చేస్తుంటారని అమె తనదైన శైలిలో బీజేపిపై విమర్శలు గుప్పించారు. చోరబాటుదారులు దేశంలోకి చోచ్చుకోచ్చారని కేంద్రం చెబుతున్నా.. వారు ఎందుకు సామాన్య ప్రజలకు కనబడటం లేదని అమె ప్రశ్నించారు.

నాగపూర్ లో కూర్చొన్న పెద్దలు అక్కడి నుంచి విద్వేషపూరిత రాజకీయాలను విస్తరింపజేేస్తున్నారని పరోక్షంగా ఆరెస్సెస్ పై స్వర భాస్కర్ విమర్శలు గుప్పించింది. పాకిస్థాన్ జాతిపిత జిన్నా ఎప్పుడో చనిపోయారని... కానీ, అతని నుంచి స్ఫూర్తిని పొందినవారు మతం పేరుతో మరోసారి దేశాన్ని విభజించేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో కాదు బీజేపి పెద్దల మనస్సుల్లోకి చోరబాటుదారుల అక్రమంగా ప్రవేశించారని స్వర భాస్కర్ విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CAA Protest  NRC protests  Swara Bhaskar  BJP  Centre  Padma Shree  Adnan Sami  Madhya Pradesh  Politics  

Other Articles