PM Modi announces formation of Ayodhya temple trust రామమందిరంపై పార్లమెంటులో ప్రధాని కీలక ప్రకటన

Sri ram janmabhoomi teerth kshetra pm modi announces formation of ayodhya temple trust

ayodhya temple trust, ayodhya ram temple trust, Shri Ram Janmabhoomi Teerth Kshetra, modi speech in parliament today, pm modi speech in parliament, pm on ram mandir, pm modi on ayodhya, pm modi on ram mandir trust, Delhi, Delhi politics, National, Politics

Prime Minister Narendra Modi personally announced the trust's formation in a speech he made in the Lok Sabha on Wednesday, days before Delhi holds a February 8 election that mainly pits the BJP against the ruling Aam Aadmi Party.

రామమందిరంపై పార్లమెంటులో ప్రధాని కీలక ప్రకటన

Posted: 02/05/2020 02:53 PM IST
Sri ram janmabhoomi teerth kshetra pm modi announces formation of ayodhya temple trust

అయోధ్యలోని రామజన్మభూమిలో వున్న రామమందిరంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. శ్రీరాముడు నడయాడిన పుణ్యభూమిలో ఆయన మందిర నిర్మాణం కోసం ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రామజన్మభూమిలో రమ్య రామ మందిర నిర్మాణం కోసం ‘రామజన్మభూమి తీర్థ క్షేత్ర’ పేరుతో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పార్లమెంటులో సహచర బీజేపి సభ్యులు తమ కరతాళధ్వనులు మధ్య ప్రధాని ప్రకటనను స్వాగతించారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ.. ఈ ట్రస్ట్ కు కేంద మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు లోక్ సభలో చెప్పారు.

క్యాబినేట్ భేటీ నుంచి నేరుగా పార్లమెంటుకు వచ్చిన ప్రధాని మోదీ.. ప్రశ్నోత్తరాలకు ముందు ఈ ప్రకటన చేశారు. ఇవాళ జరిగిన కేబినెట్‌ సమావేశంలో అయోధ్య రామమందిర నిర్మాణం అంశంలో తాము ఓ కీలక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రామ మందిర నిర్మాణం కోసం ట్రస్ట్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. మందిర నిర్మాణం, అభివృద్ధి సంబంధిత అంశాలపై ఈ ట్రస్ట్‌ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని తెలిపారు. అయోధ్యలో మందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరు మద్దతివ్వాలని కోరారు.

రామ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ప్రజాస్వామ్య విధానాలపై దేశ ప్రజలు చెరిగిపోని విశ్వాసాన్ని ప్రదర్శించారన్నారు. ఇందుకు 130కోట్ల మంది భారతీయులకు సెల్యూట్‌ చేస్తున్నానని అన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు సున్నీ వక్ఫ్‌ బోర్డ్ కు 5 ఎకరాల భూమి ఇచ్చేందుకు యూపీ ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిపారు. అయోధ్యలోని భూవివాదంపై గతేడాది నవంబరులో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. వివాదాస్పద స్థలం రామ్ లల్లాకే చెందుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles