SCR to get 11 Tejas Trains in Budget దక్షిణ మధ్య రైల్వేకు కేంద్ర బడ్జెట్ కేటాయింపులివే..

South central railway to get 11 tejas trains in budget

scr, south central railway, private trains, secunderabad, tirupati trains, Finance Minister, Nirmala Sitaraman, South Central Railway, doubling of lines, MMTS works. SCR, 11 Tejas Trains, Budget,

Finance Minister Nirmala Sitaraman gives funds to the on going works in the limits of South Central Railway for doubling of lines, third line and for 2nd phase of MMTS works. SCR also to get 11 Tejas Trains in Budget.

దక్షిణ మధ్య రైల్వేకు కేంద్ర బడ్జెట్ కేటాయింపులివే..

Posted: 02/05/2020 09:17 PM IST
South central railway to get 11 tejas trains in budget

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 11 రూట్లలో ప్రైవేట్ రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజనన్‌ మాల్యా తెలిపారు. విశాఖపట్నం రైల్వే జోన్‌ కోసం పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.170 కోట్లు నిధులు కేటాయించిందని తెలిపారు. రైల్వే బడ్జెడ్‌పై సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయంలో దక్షిణ మధ్యరైల్వే జీఎం గజనన్ మీడియా సమావేశం నిర్వహించారు. గత బడ్జెట్‌లో రూ.1,56,352 కోట్లు కేటాయిస్తే.. ఈ ఏడాది రూ.1,61,042 కోట్లు కేటాయింపులు జరిగాయని వెల్లడించారు. గత బడ్జెట్‌తో పోల్చితే 3శాతం అదనపు నిధులు కేంద్రం కేటాయించిందని చెప్పారు.

ఈ బడ్జెట్‌లో భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 2020-21 ఏడాదిలో మౌళిక సదుపాయాల కల్పన కోసం రూ.6,846 కోట్లు కేటాయించారు. డబ్లింగ్‌, మూడో లైన్‌, బైపాస్‌ లైన్‌ పనుల కోసం రూ.3,836 కోట్లు, కొత్త లైన్లు ఇతరత్రా వ్యయాల కోసం రూ. 2,856 కోట్లు, ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులకు రూ.40 కోట్లు కేటాయించారు. ఇఖ చర్లపల్లి శాటిలైట్‌ టెర్మినల్‌ స్టేషన్‌కు రూ.5 కోట్లు, మనోహరాబాద్‌-కొత్తపల్లి కొత్త లైన్‌ ప్రాజెక్ట్‌కు రూ.235 కోట్లు, మునిరాబాద్‌-మహబూబ్‌‌నగర్‌ కొత్త లైన్‌ ప్రాజెక్ట్‌కు రూ.240 కోట్లు, భద్రాచలం-సత్తుపల్లి కొత్తలైన్‌ ప్రాజెక్ట్‌కు రూ.520 కోట్లు, కాజీపేట-బల్లార్ష 3వ లైన్‌ ప్రాజెక్ట్‌ కోసం రూ.483 కోట్లు, నడికుడి-శ్రీకాళహస్తి కొత్త ప్రాజెక్ట్‌కు రూ.1198 కోట్లు, విశాఖ రైల్వే జోన్‌కు రూ.170 కోట్లు కేటాయింపులు జరిగాయి.

11 రూట్లలో ప్రైవేట్ రైళ్లు:

సికింద్రాబాద్-గౌహతి
లింగంపల్లి-తిరుపతి
లింగంపల్లి-గుంటూరు
చర్లపల్లి-వారణాసి
చర్లపల్లి-పన్వేల్
చర్లపల్లి-శాలిమార్
చర్లపల్లి-చెన్నై
చర్లపల్లి-శ్రీకాకుళం
విజయవాడ-విశాఖపట్నం
ఔరంగబాద్-పన్వేల్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles