Kalyanosthavam Prasadam for Ordinaray devotees సామాన్య భక్తులకు కరుణించిన కళ్యాణవెంకటేశ్వరుడు.!

Devotees happy over ttd giving kalyanosthavam prasadam

Devotees happy over getting big laddus, ordinary devotees big laddu, big laddus to ordinary devotees, Tirumala Temple, Tirumala tirupati devasthanam, TTD Board, Diety Sri Venkateshwara swamy, Tirumala SriVari Kalyanosthavam, big laddus special counter, Dharma reddy, SVBC Channel MD, Tirumala news, devotional

Srivari Kalyanosthavam Laddu prasadam is given to ordinary devotees without any recomendations, Devotees express their happiness and pleasure with Tirumala Tirupati Devasthanam latest decision. Prior to this decision, the Big Laddu was given to only SriVari Kalyanam devotees at Tirumala.

సామాన్య భక్తులకు కరుణించిన కళ్యాణవెంకటేశ్వరుడు.!

Posted: 02/13/2020 03:41 PM IST
Devotees happy over ttd giving kalyanosthavam prasadam

కలియుగ ప్రత్యక్ష దైవం.. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడు నిత్యపెళ్లికొడుకన్న విషయం భక్త జనకోటికి తెలిసిందే. ఈ నిత్యపెళ్లికోడుకు తలంబ్రాలను దక్కించుకునేందుకు.. కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీనివాస కళ్యాణం చేయించేందుకు భక్తులు పోటీపడుతుంటారు. ఈ ఆర్జిత సేవకు భక్తులు పోటీ పడేందుకు మరో కారణం కూడా వుంది. అదే కల్యాణ లడ్డూలు. ఈ ప్రసాదం కేవలం కల్యాణం చేసిన భక్తులకు మాత్రమే ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.

కాగా తాజా ఉత్తర్వులు మేరకు కళ్యాణసేవ చేసే భక్తులకు ఈ ప్రసాదాన్ని అందించడంలో కోత పడింది. కళ్యాణ అర్జిత సేవ చేసిన భక్తులకు పాత పద్దతిలో ప్రసాదం కావాలంటే ఇకపై రూ.600లను అదనంగా చెల్లించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో కళ్యాణసేవ చేసే భక్తులకు మండిపడుతున్నారు. అదే సమయంలో కళ్యాణోత్సవం చేసే భక్తులకు మాత్రమే ఇన్నాళ్లు లభించిన పెద్ద లడ్డూలు ఇకపై సాధారణ భక్తులకు కూడా అందుబాటులోకి తీసుకువస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం తాజా నిర్ణయం తీసుకుంది.

ఎలాంటి సిఫార్సు లేఖలు, ఆర్జిత సేవలు చేయకుండానే సాధారణ భక్తులకు కూడా పెద్ద లడ్డూలను అందించేందుకు టీటీడీ పూనుకుంది. ప్రసాదాల కౌంటర్ల పక్కనే వున్న ప్రత్యేక కౌంటర్ల పెద్ద లడ్డూల విక్రయాలు జరుపుతోంది. రెండు కేంద్రాలను ఏర్పాటు చేసి విక్రయాలను ప్రారంభించింది. చిన్న లడ్డూతో పాటు కల్యాణోత్సవ లడ్డూను విక్రయిస్తున్నారు. దీని ధరను రూ.200గా నిర్ణయించారు. అందరికీ పెద్ద లడ్డూలను అందిస్తుండటంతో సాధారణ భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles