అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా మార్చాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన నిరసన దీక్షలు ఇవాళ్టికి 60 రోజులకు చేరాయి. మూడు నెలలకోపర్యాయం జరిగే అసెంబ్లీ సమావేశాలతో అమరావతిని శాసన రాజధానిగా మార్చి.. ఈ ప్రాంత రైతులు జీవితాలను, వారి భవిష్యత్ తరాల జీవితాలను అధోగతి పాలు చేయవద్దని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారాలన్న కొత్త విధానానికి రాష్ట్ర ప్రభుత్వం ఆజ్యం పోయడం రాష్ట్ర భవిష్యత్ కు సహేతుకం కాదని అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో అభివృద్ది వికేంద్రీకరణకు తాము వ్యతిరేకం కాదని పేర్కోంటున్న రైతులు.. తాము కేవలం పాలనా వికేంద్రీకరణకు వ్యతిరేకమని అన్నారు. అందుకనే ప్రభుత్వం అసెంబ్లీలో అమోదించిన పాలనా వికేంద్రీకరణ బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గత 60 రోజులుగా నిరసనలు, అందోళనలు చేపడుతున్నారు. రాజధానిని తరలిస్తున్నారన్న సంకేతాలు వచ్చిన రోజు నుంచే అమరావతి పరిధిలోని 29 గ్రామాల పరిధిలో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నిరసన దీక్షలలో స్థానిక రైతులతో పాటు మహిళలు, యువకులు, విద్యార్థులు పాల్గోని తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు.
మందడం, తుళ్లూరు, వెలగపూడి, రాయపూడి, పెదపరిమి, కృష్ణాయపాలెంలో రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి. నిరసన దీక్షల్లో భాగంగా రైతులు విభిన్న పద్దతుల్లో ప్రభుత్వానికి నిరసన తెలిపారు. రైతుల దీక్షలు, మహిళల దీక్షలు, ర్యాలీలు, అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు, దళిత వర్గాల జేఏసీ దీక్షలు, కులవృత్తుల వారీగా దీక్షలు చేపట్టారు. వీటికి తోడు బైక్ ర్యాలీలు, పాదయాత్రలు, రహదారుల దిగ్భంధం.. వంటావార్పు కార్యక్రమాలతో వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ‘‘వద్ద వద్దు.. మాకు వద్దు.. మూడు రాజధానులు మాకు వద్దు’’ అన్న ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటికే ఇక్కడ సేకరించిన భూమిని తీసుకుని పూర్తిస్థాయి రాజధానిగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం పెద్దన్నగా జోక్యం చేసుకుని రాజధానిగా అమరావతినే కొనసాగించేలా చూడాలని కోరారు. రాజధాని రైతుల ఆందోళనలు నేటికి 60వ రోజుకు చేరడంతో వారిని పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు. రాయపూడి, తుళ్లూరు, పెదపరిమి, తాడికొండలో ఇవాళ చంద్రబాబు పర్యటన కొనసాగనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more