తెలంగాణలో కార్పోరేట్ కాలేజీల ముసుగులో జరగుతున్న అక్రమాలపై రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంటర్మీడియట్ బోర్డు గుర్తింపులేని కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల జీవితాలతో బోర్డు ఎందుకు ఆటలాడుతొందని ప్రశ్నించింది. ఈ తరహా కాలేజీల్లో అడ్మిషన్లు చేపట్టడానికి అనుమతించడాన్ని హైకోర్డు డివిజన్ బెంచ్ తప్పుపట్టింది. కాలేజీలను నిర్వహించడానికి నిర్ణీత ప్రమాణాలు పాటించాల్సి వున్నా.. వాటిని తోసిరాజుతూ బహుళ అంతస్థుల భవనాల్లో నిబంధనలకు విరుద్దంగా కాలేజీలను ఎలా నిర్వహించేందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నించింది.
అనుమతి లేని కాలేజీల్లో చదివిన విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందని ప్రశ్నించింది. విద్యార్థుల జీవితాలతో ఇంటర్ బోర్డు ఆటలాడుతోందని మండిపడ్డ న్యాయస్థానం ఘాటుగా వ్యాఖ్యాలు చేసింది. అనుమతిలేని కాలేజీల్లో ఏకంగా 20 వేల మంది విద్యార్థులు ఇంటర్ విద్యను అభ్యసిస్తున్నారని.. అధికారులు అధికారికంగా చెబుతున్నందుకు ఇలాంటి కాలేజీలపై తక్షణం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం అదేశాలు జారీ చేసింది. అనుమతులు లేని కాలజేలపై ఈ నెల 27లోగా తనిఖీలు నిర్వహించి సమగ్ర నివేదిక సమర్పించాలని న్యాయస్థానం అదేశించింది.
శ్రీచైతన్య, నారాయణ సహా పలు కార్పోరేట్ యాజమాన్యాల అధ్వర్యంలో నడుస్తున్న ఇంటర్మీడియట్ కాలేజీల విషయమై సామాజిక కార్యకర్త డి.రాజేశ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా న్యాయస్థానం ఇంటర్ బోర్డుకు అక్షింతలు వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ ఏ. అభిషేక్ రెడ్డితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. తన పిల్ పై అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడంలేదంటూ గతంలో ఇచ్చిన అదేశాలపై మరోమారు సామాజిక కార్యకర్త న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
కోర్టు ఆదేశాల మేరకు ఈ వ్యాజ్యంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి కౌంటర్ దాఖలు చేశారు. తమ తనిఖీల్లో శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలకు చెందిన 45 కాలేజీలకు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో గుర్తింపు లేదని తేలిందన్నారు. అనుమతులు లేని కార్పోరేట్ కాలేజీల్లో చేరిన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వార్షిక పరీక్షలకు హాజరయ్యేందుకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చామని ఇంటర్ బోర్డు న్యాయస్థానానికి తెలిపింది. కాగా, తగిన గుర్తింపు, అనుమతులు లేకుండా ప్రారంభించిన కాలేజీలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఆధారాలతో సహా అదనపు నివేదిక ఇవ్వాలని ఈ నెల 27లోగా సమర్పించాలని న్యాయస్థానం అదేశిస్తూ కేసు విచారణను 27కి వాయిదా వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more