తెలంగాణలో గుర్తింపులేని, సరైన అనుమతులు లేని కార్పోరేట్ కాలేజీల విషయంలో రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు చర్యలు తీసుకోవాలని తాజాగా అదేశాలను జారీ చేసింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 3 లోగా రాష్ట్రంలోని నారాయణ, శ్రీచైతన్య, శ్రీగాయత్రి, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాలల అనుమతి లేని కాలేజీలపై చర్యలు తీసుకుని.. అందుకు సంబంధించిన నివేదికను తమకు అందించాలని అదేశాలు జారీ చేసింది. దీంతో అనుమతులు లేకుండా, బిల్డింగ్ పర్మీషన్లు, అగ్నిమాపక దళం నుంచి పర్మీషన్ లేని భవనాలకు ఇక థాలాలు పడనున్నాయి.
సరైన అనుమతులు లేకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలు అడుతున్న కార్పోరేట్ కాలేజీ బ్రాంచిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త రాజేశ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ రాష్ట్రోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ‘‘అగ్నిమాపక శాఖ ఎన్వోసీ లేని కళాశాలలకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని పేర్కోన్నారు. కాగా మార్చి 4 నుంచి పరీక్షలు ఉన్నందున కళాశాలలు మూసివేస్తే విద్యార్థులపై ప్రభావం ఉంటుంది.
మరో వారం రోజుల వ్యవధిలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని న్యాయస్థానానికి తెలిపారు. ఈ సమయంలో ఇప్పటికిప్పుడు కళాశాలలు మూసివేస్తే వేల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారు. గుర్తింపు లేని కళాశాలల్లో 29,808 మంది విద్యార్థులు ఉన్నారు. అగ్నిమాపకశాఖ ఎన్వోసీ లేని కళాశాలల్లోనూ పరీక్షాకేంద్రాలు ఉన్నాయి. పరీక్షలు ముగిసిన తర్వాత కళాశాలలు మూసివేసేందుకు అనుమతివ్వాలి’’ అని ఇంటర్ బోర్డు హైకోర్టును కోరింది. అనుమతిలేని కళాశాలలపై చర్యలు తీసుకొని ఏప్రిల్ 3లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more