ఆరేళ్ల చిన్నారులు.. ఎలా అల్లరి చేస్తారంటే.. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఓ ఇరవై మంది ఒకే గదిలో వుంటే.. ఆ అల్లరి హద్దుమీరి పోతుందనడంలో తప్పేంలేదు. అయినా చిన్నారుల అల్లరి ముచ్చేటేస్తుంది కానీ.. విసుగు తెప్పిస్తుందా.? కానీ ఇక్కడున్న ఓ పోలీసు అధికారికి మాత్రం విసుగు తెప్పించింది. ఆరేళ్ల చిన్నారిని అరెస్టు చేయడమేంటని విస్తుపోవాల్సిన పోలీసు అధికారి.. ఆ మేరకు పిర్యాదు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. చట్టానికి వయస్సు కూడా లేదనుకున్నాడో ఏమో కానీ.. ఆరేళ్ల చిన్నారిని అరెస్టు చేసి చేతులు వెనక్కు కట్టి టేప్ వేసి మరీ పోలీసు జీపులో తీసుకెళ్లాడు.
అంతే ఇంకేముందు ఈ దృశ్యాలు పోలీసు అధికారి బాడీ కామ్ రికార్డు చేసింది. దీంతో చిన్నారిని అరెస్టు చేసిన కారణంగా ఉద్యోగం మీదకు తెచ్చుకున్నాడు. ఈ ఘటన వీడియో దృశ్యాలు నెట్టింట్లో వైరల్ గా మారడంతో సదరు పోలీసు అధికారిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటనపై బాధిత చిన్నారి బామ్మ మాట్లాడుతూ.. ఆరేళ్ల చిన్నారి తనను పోలీసులు చేతులకు సంకెళ్లు వేసి.. బాల నేరస్థులుండే జువైనల్ హోంకు తరలించారని, తన వేలిముద్రలు తీసుకున్నారని ఎవరితోనైనా ఎలా చెబుతోందని అమె ప్రశ్నించారు. ఇలా విమర్శలు వెల్లివిరియడంతో సదరు అధికారిపై చర్యలు తీసుకున్నారు.
మన పాఠశాలలో విద్యార్థులు తప్పు చేస్తే వారి తల్లిదండ్రులను పిలుస్తారు ఉపాధ్యాయులు. మరీ శృతిమించిన తప్పు చేస్తే ఫోన్ చేసి మరీ అర్జెంటుగా రమ్మని పిలుస్తారు. కానీ అమెరికాలో మాత్రం తల్లిదండ్రులకు బదులు పోలీసులకు పిర్యాదు చేస్తారు. మరీ అరేళ్ల పిల్లలు అల్లరి చేసినా..? అదే అక్కడ రివాజు. ఇదే జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాలోని ఓర్లాండో పట్టణానికి చెందిన ఆరేళ్ల అమ్మాయి.. స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో చదువుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి ఉపాధ్యాయులతో అనుచితంగా ప్రవర్తించిందనే కారణంతో ఆ పాఠశాల యాజమాన్యం.. ఆరేళ్ల చిన్నారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆరేళ్ల చిన్నారికి సంకెళ్లు వేసి, పోలీసు వాహనం ఎక్కించారు.
అరెస్టు చేసే సమయంలో ఆ చిన్నారి ఏడుస్తూ.. తనను అరెస్టు చేయొద్దంటూ పోలీసులను ప్రాధేయపడింది. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలనీ.. ఉపాధ్యాయులతో ఇకపై అనుచితంగా ప్రవర్తించనని వేడుకుంది. అయినా.. ఆ ఆరేళ్ల చిన్నారిపై పోలీసులు కనికరించలేదు. ఆ చిన్నారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. కాగా.. పోలీసులు ఆ చిన్నారిని అరెస్టు చేస్తున్నప్పటి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పోలీసుల చర్యను నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా ఆ ఆరేళ్ల చిన్నారి ఓ నల్లజాతీయురాలు కాబట్టే.. పోలీసులు ఆ విధంగా ప్రవర్తించారంటూ కామెంట్ చేస్తున్నారు. దీంతో స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు.. ఆరేళ్ల చిన్నారిని అరెస్టు చేసిన వారిని సస్పెండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more