ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో రేగిన అల్లర్లతో స్థానికులు భయాందోళన గురయ్యారు. అల్లర్ల మాటును అందోళనకారులు ఆడవారిపై అఘాయిత్యాలకు కూడా తెగబడే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. మహిళలను లైంగికంగా వేధించారని.. వారి చేతుల్లో పడితే ఏం జరుగుతుందోనని ఊహించే.. ప్రాణాలను పణంగా పెట్టీ మరీ భవంతుల పైనుంచి దూకామని బాధితులు తాము ఎదుర్కొన్న బాధను కన్నీళ్ల పర్యంతమై వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొన్న భయంకర అనుభవాలను బాధితులు మీడియాకు వివరిస్తున్నారు.
తమ ఇంట్లోకి రాత్రి సమయంలో ఒక గుంపు ప్రవేశించి తనను, తన ఇద్దరు కూతుర్లను లైంగికంగా వేధించారని ఓ మహిళ తెలిపింది. దీంతో భయంతో వణికిపోయామని, చివరకు శరీరానికి దుప్పట్లు చుట్టుకుని బిల్డింగ్ పై నుంచి దూకేశామని చెప్పింది. చివరకు చెత్త ఏరుకుని బతికే వారిని కూడా అల్లరి మూకలు వదలట్లేదు. చెత్త సేకరణకు ఈశాన్య ఢిల్లీకి వెళ్లిన షబ్బీర్ అనే యువకుడిపై అల్లరి మూకలు దాడిచేయడంతో తలపై తీవ్ర గాయాలయ్యాయి. తమకు అసలు ప్రశాంతంగా వుండే ఢిల్లీలో ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదని బాధితుడి తండ్రి తెలిపారు.
తమది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం అని.. అల్లర్లు జరుగుతున్నప్పటికీ తమకు వాటితో సంబంధం లేదని అనుకున్న తన కుమారుడు చెత్త ఏరుకోవడానికి వెళ్లాడని, అతడిని ఎదురోచ్చిన ఓ గుంపు అతనిపై దాడి చేసిందని తెలిపారు. ఏమీ తెలియని తన అమాయక కొడుకుపై దాడి ఎందుకు చేశారని తన కొడుకు అడుగుతున్నాడని సల్మాన్ అనే వ్యక్తి తెలిపాడు. రోడ్డుపై కనిపించిన వారిని పట్టుకుని పేరు, మతం అడిగి కొందరు దారుణంగా కొడుతున్నారని అరోపించాడు. ఇదిలావుండగా, ఢిల్లీ అల్లర్ల బాధితులకు జేఎన్‌యూ వసతి గృహాల్లో ఆశ్రయం కల్పిస్తామన్న విద్యార్థి సంఘాల నేతలపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూనివర్సిటీ క్యాంపస్‌ను పునరావాస కేంద్రంగా మార్చే అధికారం విద్యార్థి సంఘాలకు లేదని హెచ్చరించారు. పౌరసత్వ సవరణ చట్టంపై ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో పలువురు మృతి చెందగా, ఎంతోమంది గాయపడ్డారు. బాధితులకు యూనివర్సిటీ వసతి గృహాల్లో ఆశ్రయం కల్పిస్తామంటూ ఈనెల 26వ తేదీన విద్యార్థి సంఘాల నేతలు ట్వీట్ చేశారు. ఈ మెసేజ్ పై రిజిస్ట్రార్ తాజాగా స్పందించారు. ‘యూనివర్సిటీ క్యాంపస్ విద్యార్థులు, పరిశోధకుల కోసం ఉద్దేశించింది. అటువంటి క్యాంపస్ లో అల్లర్ల బాధితులకు ఆశ్రయం కల్పిస్తే కఠినంగా వ్యవహరిస్తాం. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం’ అని రిజిస్ట్రార్ హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more