దేశవ్యాప్తంగా బీఎస్–4 వాహనాలను ధర తగ్గించి అమ్ముతున్నారు. కార్ల వంటి ఫోర్ వీలర్స్ మాత్రమేకాకుండా ద్విచక్ర వాహనాలు కూడా తక్కువ ధరకు ఇస్తున్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి బీఎస్-4 (భారత్ స్టేజీ 4) కేటగిరీ వాహనాలు విక్రయించవద్దని.. బీఎస్-6 వాహనాలు మాత్రమే అమ్మాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఇప్పటికే ఉన్న బీఎస్-4 వాహనాల స్టాక్ ను అమ్మేసుకునేందుకు డీలర్లు ధరలు తగ్గిస్తున్నారు.
అప్పుడు బైకులు.. ఇప్పుడు కార్లు..
దేశవ్యాప్తంగా బీఎస్–3 వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లకు పెట్టిన గడువు ముగిసినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తింది. సుప్రీంకోర్టు గడువు పెంచుతుందేమోనన్న ఆశతో చాలా మంది డీలర్లు స్టాక్ ఉంచుకున్నారు. అయితే కోర్టు గడువు ఇవ్వకపోవడంతో ఉన్న వాహనాలను అమ్ముకునేందుకు భారీగా డిస్కౌంట్లు ప్రకటించారు. ద్విచక్ర వాహనాలను అయితే ఏకంగా రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు తగ్గించి ఇచ్చారు. దాంతో జనం షోరూమ్ ల ముందు బారులు తీరారు. కొన్ని చోట్ల పోలీసులను కూడా రంగంలోకి దింపాల్సి వచ్చింది. ఇప్పుడు మరీ అలాంటి పరిస్థితి రాకపోయినా వాహనాలపై డిస్కౌంట్లు మాత్రం మొదలయ్యాయి.
‘బీఎస్-6’ ప్రమాణ విశేషాలు
వాహనాల్లో ఇంధన వినియోగ సామర్థ్యం, కాలుష్యం విడుదలకు సంబంధించిన ప్రమాణాలే బీఎస్ (భారత్ స్టేజీ) కేటగిరీలు. మన దేశంలో 2000వ సంవత్సరంలో ఈ ప్రమాణాలను అమలు చేయడం మొదలుపెట్టారు. మొదట ఆ ఏడాది బీఎస్–1 కేటగిరీ నిబంధనలు తెచ్చారు. 2010 నాటికి బీఎస్–3 నిబంధనలు అమలు చేశారు. తర్వాత చాలా జాప్యం జరిగింది. దానిపై సుప్రీంకోర్టులో కేసులు పడటంతో 2017 ఏప్రిల్ 1 నుంచి బీఎస్–4 వాహనాలను తప్పనిసరి చేయాలని ఆదేశించింది. అంతేగాకుండా అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునేందుకు బీఎస్–5ను తప్పించి.. 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి నేరుగా బీఎస్–6 నిబంధనలు అమలు చేయాలని స్పష్టం చేసింది. బీఎస్–4 తో పోలిస్తే బీఎస్–6 వాహనాలు పదో వంతు సల్ఫర్ ను, ఐదో వంతు మాత్రమే నైట్రోజన్ డయాక్సైడ్ ను విడుదల చేస్తాయి.
ఏ కంపెనీలు ఎంత వరకు?
కారు పేరు | ధర రేంజ్ | డిస్కౌంట్ | ఇంజన్ టైప్ |
టాటా బోల్ట్ | రూ.5.29 నుంచి రూ. 7.87 లక్షలు | రూ.75000 | బిఎస్ 4 |
టాటా టైగర్ డీజిల్ | రూ.6.59 లక్షల నుండి రూ.7.86 లక్షలు | రూ.75000 | బిఎస్ 4 |
టాటా జెస్ట్ | రూ.5.89 లక్షల నుంచి రూ .9.89 లక్షలు | రూ .85,000 | బిఎస్ 4 |
హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 | రూ.6.05 లక్షల నుండి రూ.6.57 లక్షలు | రూ.75000 | బిఎస్ 4 |
హ్యుందాయ్ xcent | రూ.5.81 లక్షల నుంచి రూ .8.79 లక్షలు | రూ.95,000 | బిఎస్ 4 |
హ్యుందాయ్ వెర్నా | రూ.8.18 లక్షల నుంచి రూ .14.08 లక్షలు | రూ.90,000 | బిఎస్ 4 |
స్కోడా వేగంగా | రూ.8.82 లక్షల నుంచి రూ .1244 లక్షలు | రూ .1.60 లక్షలు | బిఎస్ 4 |
హోండా సిటీ | రూ.9.91 లక్షల నుండి రూ.14.21 లక్షలు | రూ.72,000 |
బిఎస్ 4/బిఎస్ 6 (p) |
హోండా సివిక్ | రూ.17.94 లక్షల నుండి రూ.22.35 లక్షలు | రూ .2.5 లక్షలు | బిఎస్ 4 |
హ్యుందాయ్ ఎలంట్రా | రూ .2.5 లక్షలు | బిఎస్ 4 | |
హ్యుందాయ్ ఎలంట్రా | రూ.15.89 నుంచి రూ .20.39 లక్షలు | రూ. లక్ష | బిఎస్ 6 |
స్కోడా అష్టావియా | రూ.19 లక్షల నుంచి రూ .23.60 లక్షలు | రూ .2.4 లక్షలు | బిఎస్ 4 |
స్కోడా సూపర్బ్ | రూ.28.50 లక్షల నుంచి రూ .31 లక్షలు | రూ .2.5 లక్షలు | బిఎస్ 4 |
మారుతి విటారా బ్రెజ్జా డీజిల్ | రూ.7.62 లక్షల నుంచి రూ.10.59 లక్షలు | రూ .86,200 | బిఎస్ 4 |
నిస్సాన్ కిక్స్ | రూ. 9.55 లక్షల నుండి రూ.13.69 లక్షలు | రూ .1.60 లక్షలు | బిఎస్ 4 |
హ్యుందాయ్ క్రెటా 1.6 | రూ.10 లక్షల నుంచి రూ. 15.72 లక్షలు | రూ .1.15 లక్షలు | బిఎస్ 4 |
హోండా BR-V | రూ.9.53 లక్షల నుండి రూ.13.83 లక్షలు | రూ. 1.1 లక్షలు | బిఎస్ 4 |
హ్యుందాయ్ టక్సన్ | రూ.18.76 లక్షల నుండి రూ.26.97 లక్షలు | రూ .2.50 లక్షలు | బిఎస్ 4 |
హోండా CR-V | రూ.28.27 నుంచి రూ .32.77 లక్షలు | రూ .5 లక్షలు | బిఎస్ 4 |
టాటా హెక్సా | రూ.13.70 లక్షల నుంచి రూ .19.28 లక్షలు | రూ .2.15 లక్షలు | బిఎస్ 4 |
టాటా హారియర్ | రూ.13.69 లక్షల నుంచి రూ.17.70 లక్షలు | రూ .1.4 లక్షలు | బిఎస్ 4 |
మహీంద్రా ఎక్స్‌యూవీ 300 | రూ. 8.10 లక్షల నుంచి రూ.12.69 లక్షలు | రూ.79,500 |
బిఎస్ 4/బిఎస్ 6 (p) |
మహీంద్రా మరాజో | రూ. 9.99 లక్షల నుండి రూ.14.76 లక్షలు | రూ .1.66 లక్షలు | బిఎస్ 4 |
మహీంద్రా ఎక్స్‌యూవీ 500 | రూ .12.22 లక్షల నుంచి రూ.15.55 లక్షలు | రూ.1.04 లక్షలు | బిఎస్ 4 |
మహీంద్రా స్కార్పియో | రూ .10.16 లక్షల నుంచి రూ.16.37 లక్షలు | రూ.79,400 | బిఎస్ 4 |
మహీంద్రా అల్టురాస్ జి 4 | రూ .27.70 లక్షల నుంచి రూ.30.70 లక్షలు | రూ 3.05 లక్షలు | బిఎస్ 4 |
మహీంద్రా టియువి 300 | రూ .8.54 లక్షల నుంచి రూ.10.55 లక్షలు | రూ.91,750 | బిఎస్ 4 |
రెనాల్ట్ డస్టర్ (ప్రీ/ఫేస్ లిఫ్ట్) | రూ.7.99 లక్షల నుండి రూ. 12.50 లక్షలు | రూ .2 లక్షలు | బిఎస్ 4 |
రెనాల్ట్ కాప్టూర్ | రూ. 9.50 లక్షల నుంచి రూ .13 లక్షలు | రూ .2.40 లక్షలు | బిఎస్ 4 |
రెనాల్ట్ లాడ్జీ | రూ. 8.63 లక్షల నుంచి రూ.12.12 లక్షలు | రూ .2.10 లక్షలు | బిఎస్ 4 |
స్కోడా కోడియాక్ | 36.79 లక్షల రూపాయలు | రూ .2.37 లక్షలు | బిఎస్ 4 |
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more