ఢిల్లీ అల్లర్ల అంశం మరోసారి పార్లమెంటును కుదిపేసింది. ఢిల్లీ అల్లర్లపై తప్పక చర్చించాల్సిందేనన్న విపక్షాల డిమాండ్ నేపథ్యంలో పలు పర్యాయాలు వాయిదా పడిన లోక్ సభ.. చివరకు గంధరగోళం మధ్య బుధవారానికి వాయిదా పడింది. నిన్న అధికార, విపక్షాల సభ్యుల మధ్య తోపులాటకు దారితీసిన పరిణామాల నేపథ్యంలో సభలో సభ్యులు హుందాగా వ్యవహరించాలని, సభా ఔనత్యాన్ని తగ్గించరాదని స్పీకర్ సూచించారు. అయినా ఢిల్లీలో రేగిన హింసాత్మక ఘటనలు, మృతులపై చర్చించాల్సిందేనంటూ విపక్షాలు పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది.
దీంతో స్పీకర్ ఓం బిర్లా మరోమారు సీరియస్ అయ్యారు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత వాయిదా తీర్మానాలపై చర్చించిద్దామన్నా విపక్ష సభ్యులు వినకపోవడంతో సభలో రసాభాసగా మారింది. విపక్ష సభ్యుల తీరుపై స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా మండిపడ్డారు. సభా గౌరవాన్ని నిలబెట్టాలని కోరారు. అయితే ఇకపై అధికార, విపక్షాలకు చెందిన సభ్యులెవరైనా.. పోడియం దగ్గరకు దూసుకొస్తే, సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తానంటూ సీరియస్గా హెచ్చరించారు. ఎంపీలెవరూ ప్లకార్డులు సభలోకి తీసుకురావద్దని హెచ్చరించారు.
దీనిపై విపక్షాలు అభ్యంతరం తెలపడంతో రచ్చ కొనసాగింది. స్పీకర్ అధికార పార్టీ పక్షానికి సానుకూలంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. స్పీకర్ తీరుపై విపక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్.. ఢిల్లీ అల్లర్లతో దేశం అశాంతి నెలకొందన్ని ఈ తరుణంలో దీనిపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా వుందని అన్నారు. ప్రజలు తీవ్ర అందోళనలోకి నెట్టివేయబడ్డారని కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు. అల్లర్లు విస్తరిస్తున్నా ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు.
దేశంలో విద్వేషాలు చెలరేగుతున్నాయని, ఢిల్లీ మండిపోతుందని.. ఇలాంటప్పుడు సభలో చర్చించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. అటు ఇప్పటివరకు ప్రభుత్వం సభలో ఎలాంటి ప్రకటన చేయలేదంటూ డీఎంకే ఎంపీ బాలు తప్పుబట్టారు. మరోపక్క ఢిల్లీ అల్లర్లపై పెద్దలసభలోను దుమారం రేగింది. రాజ్యసభ ప్రారంభంలోనే విపక్ష కాంగ్రెస్ నినాదాలు మొదలుపెట్టింది. ఢిల్లీ అల్లర్లపై చర్చకు పట్టుబట్టింది. వెంకయ్యనాయుడు చర్చకు అంగీకరించలేదు. సభ్యులు నినాదాలు ఆపకోవడంతో సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more