Rajiv Swagruha flats to be sold by committee రాజీవ్ స్వగృహా ఆస్తుల విక్రయానికి కమిటీ

Telangana committee to auction rajiv swagruha houses

rajiv swagruha, rajiv swagruha bandlaguda, rajiv swagruha pocharam, rajiv swagruha infrasture, rajiv swagruha houses, rajiv swagruha houses on sale, rajiv swagruha houses auction, committee on rajiv swagruha houses, Telangana, Politics

The state government’s ambitious plan of selling 3,700 flats constructed under Rajiv Swagruha scheme at Bandlaguda and Pocharam to raise revenue may not be successful unless repairs are carried out, civic amenities and other facilities are provided and an attractive package is offered.

రాజీవ్ స్వగృహా ఆస్తుల విక్రయానికి కమిటీ

Posted: 03/10/2020 08:31 PM IST
Telangana committee to auction rajiv swagruha houses

రాజీవ్‌ స్వగృహ పథకం కింద నిర్మించిన బహుళ అంతస్థుల భవనాలలోని ఫ్లాట్లను యధాతధా స్థితిలో విక్రయించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. గత నేలలో సమావేశమైన క్యాబినెట్ ఈ ప్లాట్లను విక్రయించాలని నిర్ణయానికి వచ్చింది. అయితే ఈ ఫ్లాల్ల అమ్మకానికి కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేయాలని భావించిన ప్రభుత్వం తాజాగా కార్యదర్శి కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఫ్లాట్లను గతంలో కూడా ఓ సారి అమ్మకాలు జరిపేందుకు అహ్వానాలను పిలువగా పరాభవం ఎదురైంది.

3700 ప్లాట్స్ కోసం దరఖాస్తులను పిలువగా కేవలం ఒకే ఒక్క ధరఖాస్తు రావడంతో అధికారుల నోళ్లలో పచ్చి వెలకాయ పడినట్లు అయ్యింది, రంగారెడ్డి జిల్లా పరిధిలోని బండ్లగూడ, పోచారంలోని ప్లాట్లు, ఇతర ఆస్తుల అమ్మకంపై ఈ కమిటీ విధివిధానాలను ఖారారు చేయనుంది. ఈ మేరకు గృహనిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో ఆర్థిక, పురపాలక శాఖల ముఖ్యకార్యదర్శులు రామకృష్ణారావు, అరవింద్‌ కుమార్ సభ్యులుగా ఉన్నారు.

రాష్ట్రంలో మధ్యతరగతి ప్రజలు నివాసం ఉండేలా ఇళ్లను నిర్మించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ ఏర్పాటైన విషయం తెలిసిందే. కొన్నాళ్ల తర్వాత ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఈ కార్పొరేషన్‌ ద్వారా మొదలుపెట్టిన ప్లాట్ల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఆ ప్లాట్లను యథాతథంగా విక్రయించి కొంత నిధులను సేకరించడంతోపాటుగా కార్పొరేషన్‌పై ఉన్న ఆర్థిక భారాన్ని తొలగించుకునేందుకు రాజీవ్‌ స్వగృహ ఆస్తులను విక్రయించేందుకు కొన్ని రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles