తమిళనాడు రాజకీయాల్లో కరుణానిధి, జయలలిత లేకపోవడం వల్లే తాను ప్రజల్లోకి, రాజకీయాల్లోకి వస్తున్నానని సినీనటుడు రజనీకాంత్ తెలిపారు. 2016-17లో తమిళనాడులో రాజకీయ సుస్థిరత లోపించిందన్న ఆయన రాజకీయాల్లోకి.. మంచివారు రావడం లేదని అవేదన వ్యక్తం చేశారు. దీంతో రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమే ఉండాలని, ప్రభుత్వాలు, పార్టీలు మాత్రం నిత్యం తమ వైపునే వుండాలని ప్రస్తుతం ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. రాజకీయాల్లో సమూల ప్రక్షాలన తాను చేయడానికి రాలేదన్న ఆయన వ్యవస్థను సరిచేయకుండా మార్పురావాలని కోరుకోవడం కూడా సరికాదని అన్నారు.
తనను అమితంగా అభిమానించే ప్రజలకు సాధ్యమైనంత వరకు సేవ చేయడమే ధ్యేయంగా చెప్పుకోచ్చారు. అయితే ఈ నేపథ్యంలో తాను కేవలం పార్టీకి అధినేతగా మాత్రమే వుంటానని చెప్పారు. తనకు పదవులపైన ఎలాంటి ఆశ లేదన్నారు. తన వయసు 68 ఏళ్లని.. ఈ వయస్సులో తనకు ముఖ్యమంత్రి పదవి అవసరమా? అని అన్నారు. నీతి, నిజాయతీ, ప్రజల మనసులో స్థానం ఉన్నవారికే సీఎం అయ్యే అర్హత ఉందని.. అందుకనే తన పార్టీలో యువనాయక్వంలో ఆ లక్షణాలున్న వారిని ఎంచుకుని సీఎం పదవికి ఎంపిక చేస్తామని అన్నారు.
తాను పూర్తిగా పార్టీపైనే దృష్టి పెడతానని అన్నారు. రాజకీయ పార్టీలు ప్రజలకు జవాబుదారీగా ఉండాని చెప్పారు. అలాంటి పార్టీలు ప్రస్తుతం సమాజంలో ఎక్కడ కనిపించడం లేదని.. అందుకనే తాను రాజకీయ అరంగ్రేటం చేస్తున్నానని చెప్పారు. 1996కి ముందు ఏనాడు రాజకీయాల గురించి తాను ఆలోచించలేదని.. ఈ విషయంపై ప్రజలు తనను ఎప్పుడు అడిగినా దేవుడి దయ అని చెప్పానని గుర్తుచేసుకున్నారు. కానీ రెండేళ్ల క్రితం తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పానని తెలిపారు. తాను ఒక విషయంలో అసంతృప్తితో ఉన్నానని.. అయితే తన అసంతృప్తి గురించి చాలా ఊహాగానాలు వస్తున్నాయని వాటన్నింటికీ ఇవాళ తాను ఫుల్ స్టాప్ పెట్టానని అన్నారు.
తన పార్టీలో 60 నుంచి 65 శాతం వరకు యువతకే అవకాశమని రజనీకాంత్ చెప్పారు. అయితే రాజకీయాల్లో విద్య, వయసు కూడా ముఖ్యమేనన్న ఆయన తన పార్టీలో విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్లకు కూడా ప్రాధాన్యతనిస్తానన్నారు. పార్టీ అధ్యక్షుడికి ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర ఉండకూడదని తాను భావిస్తున్నట్లు తెలిపారు. 45 ఏళ్లుగా సినిమా రంగంలో సాధించిన పేరు రాజకీయాల్లో ప్రభావం చూపుతాయని కూడా అన్నారు. అయితే తమిళనాడులోని రెండు బలమైన పార్టీలను తాను ఈ ఎన్నికల ద్వారా ఎదుర్కోబోతున్నట్లు కూడా చెప్పారు.
గత కొన్ని దశాబ్దాలుగా తమిళనాట ప్రజలు సినీమా రంగానికి చెందినవారికి మధ్య అనుబంధం కొనసాగుతోందిని అన్నారు. ఆనాడు కరుణానిధిని చూసే డీఎంకేకు అవకాశం ఇచ్చారన్న ఆయన.. కేవలం కరుణానిధిని చూసే 70 శాతం మంది ప్రజలు డీఎంకేకు ఓటు వేశారని అన్నారు. అదే ఫార్ములాను అన్నాడీఎంకే కూడా అనుసరించింది. ఈ రెండు పార్టీలను తాను ఎదుర్కోబోతున్నాను. ఇప్పటి వరకు ఈ పరిస్థితి గతంలో వున్న పార్టీలకు ఏర్పడలేదని అన్నారు. కాగా సీఎం రజనీ అన్న నినాదలు వద్దని చెప్పిన రజనీ.. తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదని కార్యకర్తలకు తేల్చిచెప్పారు. 2021లో ప్రజలు ఓ విప్లవంలా ప్రభుత్వాన్ని మారుస్తారని రజనీకాంత్ వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more