కోటిఆశలతో తన జీవిత భాగస్వామిని ఎంచుకుని ఏడే అడులు వేసిన తరువాత.. తన భార్యతో అనుబంధాన్ని పంచుకునేందుకు సిద్దమౌతున్న తరుణంలో అతడికి తెలిసిన పిడుగులాంటి వార్త.. తన బంగారు భవిష్యత్తును చిధ్రం చేశాయి. అతను కన్న కలలను కల్లోలం చేశాయి. తన సహధర్మచారిణితో కలసి జీవితంలో ఎలా ఎదగాలో అని అతను నిర్మించుకున్న ఆశళ హార్మ్యాలు పేకపేడలుగా కూలిపోయాయి. పెళ్లైన నెల రోజుల తరువాత కానీ ముహూర్తం లభించిక పోవడంతో వాయిదా పడిన అతని ఫస్ట్ నైట్ రోజున.. నైట్ మేర్ (సింహస్వప్నంలా) వచ్చిన గిప్ట్ తన జీవితాన్ని అదోగతి పాలుచేసింది.
మ్యారేజ్ గిఫ్ట్ అంటూ ఫేస్ బుక్ మెసేంజర్లో తన భార్య వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు రావడం.. నిలదీస్తే.. ఔను నిజమే.. అంటూ అతని భార్య తన ఏడేళ్ల ప్రేమ గురించి నిజాలు చెప్పింది. తనకు న్యాయం కావాలంటూ లబోదిబోమన్న భర్త.. పోలీసులను ఆశ్రయిస్తానని చెప్పడంతో.. ఈ విషయాన్ని బయటకు చెబితే.. కట్నం కోసం తనపై వేధింపులకు గురిచేస్తున్నాడని తానే పోలీసులకు పిర్యాదు చేస్తానన్న భార్య వార్నింగ్.. ఇలా కాదని భార్య తండ్రికి విషయాన్ని చెబితే.. అతను కూడా ఆత్మహత్య చేసుకుంటానన్ని బెదింపులకు పాల్పడటంతో.. ముందు నుయ్యి వెనుక గోయ్యి పరిస్థితుల్లో చిక్కుకుపోయిన భర్త.. చివరాఖకు పోలీసులను ఆశ్రయించాడు.
ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సందేశ్ అనే సుబ్రహ్మణ్యనగర్ ప్రాంతానికి చెందిన యువకుడితో చిక్ మంగళూర్ ప్రాంతానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి అయిన యువతితో వివాహం జరిగింది. .31ఏళ్ల సందేశ్ తనకంటూ వయస్సులో నాలుగేళ్లు చిన్నదైన యువతిని గత ఏడాది జూన్ నెలలో వారికి నిశ్చితార్థం జరిగింది. ఇరుతరపు బంధువుల మధ్యన అట్టహాసంగా ఈ తంతు జరిగింది. ఆ తరువాత ప్రైవేటు ఎంప్లాయి కాబట్టి యువకుడికి సెలవుల్లో తన కాబోయే భార్య ఇంటికి వచ్చివెళ్లేవాడు. ఇక చూస్తుండగానే నవంబర్ 24న హసన్ ప్రాంతంలో వీరిద్దరికీ అట్టహాసంగా పెళ్లి జరిగింది.
దాదాపు 21 ఒక్క రోజుల తరువాత వీరిద్దరికీ ఫస్ట్ నైట్ ముహూర్తం ఫిక్స్ అయ్యింది. అప్పటివరకు శుభగడియలు లేవని వాయిదా పడింది. దీంతో తన తొలిరాత్రి ముహూర్తానికి వరుడు సిద్దం అవుతున్న తరుణంలో సరిగ్గా రెండు రోజులు ముందు డిసెంబరు 13 రాత్రి ఫేస్ బుక్ మెసేంజర్ లో కొన్ని ఫోటోలు వచ్చాయి. ఆ ఫోటోల్లో తన భార్య వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంది. దీంతో షాక్ తిన్న వరుడు.. ఏం చేయాలో తెలియక మరోమారు క్షుణ్ణంగా పరిశీలించగా, వాటితో పాటు ఓ మొబైల్ నెంబర్ కనిపించింది. దీంతో ఆ నెంబర్ కు ఫోన్ చేయగానే.. తనకు.. వరుడి భార్యతో అన్ని రకాలుగా సన్నిహిత సంబంధాలు, శారీరిక సంబంధలు వున్నాయన్న విషయం చెప్పాడు.
అయితే ఇదేదో బ్లాక్ మెయిలింగ్ కాదని, మీ నిశ్చితార్థం అయిన తరువాత కూడా తామిద్దరి మధ్య పలు దఫాలుగా శారీరికంగా కలుస్తూనే వున్నామని చెప్పాడు. తామిద్దరి మధ్య బ్రేకప్ జరగలేదని.. కూడా చెప్పాడు. దీంతో వరుడికి మతిపోయింది. పెళ్లైన నాటి నుంచి ఇప్పటి వరకు తనతో వున్న భార్య ఏ రోజు ఈ విషయాన్ని తనకు చెప్పలేదని తీవ్ర మనోవేధనకు గురైన వరుడు.. అమెను ఎలా అడగాలి అంటూ మనోవేధన చెందుతున్న తరుణంలో కాసేపటికి మళ్లీ ఫోన్కు వీడియో మెసేజ్ వచ్చింది. అందులో వధువు తన ప్రియుడితో శారీరికంగా కలిసివున్న పోర్న్ వీడియో ఉన్నాయి. వీటితో పాటు పెళ్లికి ముందు రోజు.. ఇక తనతో వచ్చిన తరువాత కూడా ఇద్దరి మధ్య జరిగిన వాట్సప్ మెసేజ్ స్క్రీన్ షాట్లు వున్నాయి.
దీంతో ఇక నిమిషం ఆలస్యం చేయని వరుడు తన భార్యను నిలదీసాడు. దీంతో అన్నింటికీ అమె అంగీకరించింది. తనకు తన ప్రియుడంటేనే ఇష్టమన్న విషయాన్ని చెప్పింది. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాలని ప్రయత్నిస్తే.. తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని తానే కేసు పెడతానని అమె హెచ్చరించింది. ఇక తన మామకు ఈ విషయాన్ని చెప్పాలని ప్రయత్నించగా అతడు మరో అడుగు ముందుకేసీ విషయం పబ్లిక్ అయితే తనకు ఆత్మహత్యే శరణ్యమని, అయితే విషయాన్ని పబ్లిక్ చేసినందుకు నీ పేరు రాసీ మరీ చస్తానని బెదిరించడంతో వరుడి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.
ఇరువైపుల నుంచి ఇటు భార్య, అటు మామలు బెదిరించడం.. బ్లాక్ మెయిల్ చేయడంతో.. గత మూడు నెలలుగా మానసిక క్షోభ అనుభవించిన వరుడు ఎట్టకేలకు రోజువారి పరిణామాల నేపథ్యంలో తన భార్య, మామల పరిస్థితిని గమనించి.. వారు బెదిరించే వారే కానీ.. నిజంగా విపరీత నిర్ణయాలు తీసుకునేవారని గ్రహించాడు. తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా పోలీస్ స్టేషన్ కు వెళ్లి రహస్యంగా వారిపై పిర్యాదు ఇచ్చాడు. దీంతో పోలీసులు వరుడు భార్యతో పాటు అమె ప్రియుడు, అమె తల్లిదండ్రులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more