coronavirus AlertL Section 144 imposed in Delhi కరోనా వైరస్ అలర్ట్.. దేశరాజధానిలో 144 సెక్షన్..

Section 144 imposed in noida due to increase in coronavirus cases

coronavirus in india, coronavirus, covid-19, corona spread, section 144, Delhi, noida, section 144 coronavirus, No Public Gathering, noida police commissioner, Gautam Budh Nagar, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

Amid the novel coronavirus (Covid-19) outbreak in the country, the Noida Police Commissionarate ordered the imposition of Section 144 in Gautam Buddha Nagar to restrict gathering of people. He has announced that no social, political, cultural, religious, sports and business gatherings shall be allowed,

కరోనా వైరస్ అలర్ట్.. దేశరాజధానిలో 144 సెక్షన్..

Posted: 03/19/2020 12:52 PM IST
Section 144 imposed in noida due to increase in coronavirus cases

ప్రపంచవ్యాప్తంగా కళారా నృత్యం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్.. మన దేశంలోనూ పంజా విసురుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వం కరోనాపై ఆంక్షలు విధించింది. ఢిల్లీ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఢిల్లీ పోలీస్ కమిషనర్ శ్రీవాస్తవ గురువారం ఆదేశాలు ఇచ్చారు. వినోదం, కాలక్షేపం కోసం బయటకు రావొద్దని సీపీ కోరారు. ర్యాలీ, నిరసనలు, వినోద ప్రదర్శనల్లో పాల్గొనవద్దని అదేశాలు జారీ చేశారు. తమ ఆదేశాలు ఉల్లంఘించిన ప్రజలపై కఠిన చర్యలు తప్పవని సీపీ వార్నింగ్ ఇచ్చారు.

ఇవాళ్టి నుంచి మార్చి 31వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ చర్యలను చేపడుతున్నామని చెప్పిన ఆయన ప్రజలు భయపడాల్సిన పని లేదని  స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అసత్య ప్రచారాలు చేసేవారిపైనా తాము చర్యలకు ఉపక్రమిస్తామని చెప్పారు. అలాగని సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలను ప్రజలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. కరోనా వ్యాధిపై అప్రమత్తతో పాటు ముందస్తు చర్యలపై ప్రజలకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూ వుంటుని చెప్పారు.

కరోనా వైరస్ అంటువ్యాధి తీవ్రంగా ప్రబలుతోంది. కరోనా వైరస్ ను నియంత్రించడమే ప్రధాన అంశంగా మారింది. ఇప్పటికే నాగ్ పూర్, ముంబైలో 144 సెక్షన్ అమల్లో ఉంది. ప్రజలు గుమిగూడకుండా చేయడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయొచ్చని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఢిల్లీకి ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. వివిధ దేశాల నుంచి తీసుకొస్తున్న వారిని ఢిల్లీలోని క్వారంటైన్ లో ఉంచుతున్నారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని అధికారులు సూచించారు. షహీన్ బాగ్ లో మాత్రం సీఏఏ వ్యతిరేక నిరసన, ధర్నా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీంతో ఆందోళనలు విరమింపజేసే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles