ప్రపంచవ్యాప్తంగా కళారా నృత్యం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్.. మన దేశంలోనూ పంజా విసురుతోంది. ఇప్పటికే 200 మందిపై తన ప్రభావాన్ని చాటిన ఈ మహమ్మారి.. ఇటు తెలంగాణలనూ ప్రబలుతోంది. ఇప్పటికే ఈ వ్యాధిబారిన పడి నలుగురు వృద్దులు బలయ్యారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం ప్రజలకు సూచనలు చేస్తూ.. కరోనా వైరస్ పాజిటవ్ రోగులను అసుపత్రులకు తరలించి చికిత్సను అందజేస్తోంది. కరోనా వ్యాది ప్రబలకుండా విద్యాసంస్థలకు, సినిమా హాళ్లు, జనసామార్థ్యం అధికంగా వున్న ప్రాంతాల్లో నిషేదాజ్ఞలను అమల్లోకి తీసుకువచ్చింది.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నివేదికల ప్రకారం కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో నమోదయ్యాయి. మహారాష్ట్రలో 48 మంది కరోనా బాధితులను గుర్తించారు. ఆ తరువాత కేరళలలో 29 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఇక ఈ రెండు రాష్ట్రాల తరువాత ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా బాధితులు అధికంగా వున్నారు. ఇక తాజాగా తెలంగాణలో మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో, ‘కరోనా’ కేసుల సంఖ్యల 18కి చేరింది. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, విదేశాల నుంచి వచ్చేవారితోనే ప్రమాదం పోంచివుందని అన్నారు.
తాజాగా నమోదైన రెండు కేసుల్లోనూ లండన్ నుంచి వచ్చిన ఇద్దరు భారతీయులకు ఈ వైరస్ సోకినట్టు తేలిందని అన్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రికి వారిని తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారికే ‘కరోనా’ సోకిందని, పద్దెనిమిది కేసుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో నలుగురు రెండ్రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని, ఈ వైరస్ నుంచి కోలుకున్న ఒకరిని డిశ్చార్జి చేశామని చెప్పారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో నివసిస్తున్న ఎవరికీ ‘కరోనా’ సోకలేదని, విదేశాల నుంచి వచ్చిన వారే దీని బారినపడ్డారని మరోమారు స్పష్టం చేశారు.
కారణం తెలియదు కానీ, బాధితుల నుంచి వైరస్ వ్యాప్తి చెందడం తక్కువగా ఉందని, బాధిత కుటుంబ సభ్యులకు, చికిత్స అందిస్తున్న ఎవరికీ ‘కరోనా’ వ్యాప్తి చెంద లేదని అన్నారు. ‘కరోనా’ విషయంలో రాష్ట్రం తీసుకున్న చర్యలను కేంద్రంగా కూడా ప్రశంసించిందని, అధిక ఉష్ణోగ్రతల ప్రదేశంలో ఈ వైరస్ బతకదని నిపుణులు చెబుతున్నారని అన్నారు. ఒకవేళ బాధితుల సంఖ్య పెరిగితే ఏం చేయాలో కూడా తాము ఆలోచించామని, ‘కరోనా’ సోకితే అద్దె ఇంట్లో ఉన్న వారిని ఖాళీ చేయిస్తారు కనుక, వేల మందిని క్వారంటైన్ చేయగలిగేలా సన్నద్ధం అయినట్టు వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more