కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తెలంగాణ వాసుల గుండెల్లో అలజడి రేపుతోంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంపైన ఈ మహమ్మారి తన పంజాను విసిరుతోంది. ఇప్పటికే ప్రజలు అప్రమత్తంగా వుండాలని ప్రభుత్వంతో పాటు అధికారులు కూడా హెచ్చరిస్తున్నా.. లాక్ డౌన్ సమయంలో ప్రజలు బయటకు రావడం పట్ల విమర్శలు వినబడుతున్నాయి. ఇదే క్రమంలో హైదరాబాద్ లో మారో వార్త కలకలం రేపుతోంది. కరోనా లక్షణాలు ఉన్న ఓ మహిళ క్వారంటైన్ సెంటర్ నుంచి తప్పించుకుందన్న విషయం తెలియడంతో నగరవాసులు తీవ్రం అందోళనకు గురవుతున్నారు.
కోఠిలోని డీఎంఈ కార్యాలయానికి వచ్చిన ఓ మహిళను.. అమె కరోనా వైరస్ పాజిటివ్ బాధితురాలని పోలీసులు గుర్తించారు. ఆమె చేతిపై ఉన్న క్వారంటైన్ గుర్తుని చూసిన పోలీసులు, ఆమె క్వారంటైన్ చేస్ుతన్నట్లుగా గుర్తించారు. పోలీసులు ఆమెని పట్టుకునే లోపే ఆమె పరార్ అయినట్టు తెలుస్తోంది. ఆ మహిళ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కరోనా లక్షణాలు కలిగి క్వారంటైన్ సెంటర్ లో ఉంటున్న ఓ మహిళ సాయంత్రం కోఠిలోని డీఎంఈ(డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) ఆఫీస్ కు వచ్చింది.
తనకు ఫిట్ నెస్ సర్టిఫికెట్ కావాలని కోరింది. తన తల్లిదండ్రులతో కలిసి ఆమె ఆఫీస్ కి వచ్చింది. కాసేపటికి మహిళ గురించి తెలుసుకున్న అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసుల డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ), డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిసరాల్లో మహిళ కోసం పోలీసులు గాలించారు. కానీ అప్పటికే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొన్ని పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. కోఠి పరిసర ప్రాంతాల్లో మహిళ కోసం గాలిస్తున్నాయి. కాగా, సదరు మహిళ ఏ క్వారంటైన్ సెంటర్ నుంచి వచ్చింది? ఎప్పటివరకు క్వారంటైన్ డేట్ ఉంది? అనే వివరాలు తెలియాల్సి ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more