కరోనా భయంతో అల్లాడుతున్న వారికి ఇది శుభవార్తే. ఈ మహమ్మారి బారి నుంచి తప్పించుకునేందుకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ సమర్థంగా పనిచేస్తుందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. కరోనా వైరస్‌పై తాము ఏర్పాటు చేసిన జాతీయ బృందం దీనిని సిఫారసు చేసినట్టు పేర్కొంది. దీనికి భారత ఔషధ నియంత్రణ మండలి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వివరించింది. దీని వాడకానికి సంబంధించి తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా బాధితులకు, అనుమానితులకు, వైద్య సేవలు అందించే వారిలో కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఇవ్వొచ్చని తెలిపింది.
కరోనా రోగుల బంధువులు కూడా తీసుకోవచ్చని పేర్కొంది. అయితే, దీనిని సంబంధిత వైద్యుల సూచన మేరకే వేసుకోవాలని హెచ్చరించింది. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వినియోగిస్తున్న సమయంలో ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది. వైద్య సేవలు అందిస్తున్న వారు తొలి రోజు రెండుసార్లు 400 మిల్లీగ్రాముల చొప్పున వాడాలని, ఆ తర్వాత ఏడు వారాలపాటు వారానికి ఒకసారి 400 ఎంజీ భోజనంతో కలిపి తీసుకోవాలని సూచించింది.
రోగులతో కలిసి ఉంటున్న కుటుంబ సభ్యులు తొలి రోజు రెండుసార్లు 400 మిల్లీగ్రాములు, ఆ తర్వాత మూడు వారాలపాటు వారానికి 400 ఎంజీ చొప్పున భోజనంతో పాటు ఈ మందు తీసుకోవాలని వివరించింది. అయితే, 15 ఏళ్లలోపు చిన్నారుల్లో మాత్రం కోవిడ్ ముందస్తు నివారణ కోసం ఈ ఔషధాన్ని ఉపయోగించకూడదని హెచ్చరించింది. కాగా, బనర్జీ అనే 69 ఏళ్ల వైద్యుడు మాత్రం ఈ ఔషదాన్ని తీసుకుంటే మరణాన్ని తీసుకున్నట్లేనని అభిప్రాయపడ్డారు. ఈ మందు డోసేజ్ కాసింత ఎక్కువైనా.. మరణం తప్పదని హెచ్చరించారు. ఎప్పుడో మలేరియా ప్రపంచాన్ని కబళించిన నేపథ్యంలో ఈ మందును వాడినట్లు ఆయన తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more