కరోనా భయంతో అల్లాడుతున్న వారికి చిరు ఉద్యోగులకు, చిన్నసంస్థలకు కేంద్రం తాజాగా శుభవార్తను అందించింది. లక్ష 70 వేల కోట్ల రూపాయలతో ఉద్దీపన పథకాలను ప్రకటించిన కేంద్రం.. ఇందులో చిన్న సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు లబ్ది చేకూరేలా ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ పథకం కింద కేంద్రం.. రూ.15 వేల లోపు వేతనం పొందే ఉద్యోగులతో పాటు సంస్థలకు గుడ్ న్యూస్ అందించింది. అదెలా అంటే సంఘటిత రంగ కార్మికుల ఈఫీఎఫ్ (ఉద్యోగుల భవిష్యనిధి) కింద ఉద్యోగుల వాటాతో పాటు సంస్థలు/యాజమాన్యాల వాటా రెండింటిని వచ్చే మూడు నెలల పాటు ప్రభుత్వమే భరించనున్నందని ప్రకటించింది.
రూ.15వేల లోపు జీతం ఉండి వంద లోపు ఉద్యోగులున్న సంస్థలకే ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది. దీని ప్రకారం.. ప్రభుత్వం 24 శాతం వ్యక్తిగత వేతనాల్లో (12 శాతం ఉద్యోగులు, 12 శాతం సంస్థ నుంచి) రాబోయే మూడు నెలల పాటు కంపెనీలకు ఈపీఎఫ్ మొత్తాన్ని చెల్లించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తితో దేశంలో పరిస్థితుల దృష్ట్యా సంఘటిత రంగ కార్మికులకు ఈ ప్రకటన జారీ చేసింది. ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ రెగ్యులేషన్‌లో సవరణలు చేసినట్టు నిర్మలా తెలిపారు. ఈపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తున్నవారు నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ 75శాతం వరకు లేదా మూడు నెలల వేతనం ఇందులో ఏది తక్కువ అయితే అది తీసుకోవచ్చని తెలిపారు. ఈ నిర్ణయం 4 కోట్లకు పైగా ఉద్యోగులకు ఊరట కలిగించే విషయమే.
కరోనా రిలీఫ్ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం లక్షా 70వేల కోట్లను ప్యాకేజీని ప్రకటించింది. వైద్యా,ఆరోగ్య, పారిశుథ్య కార్మికులు, పారామెడికల్ సిబ్బంది, ఆశావర్కర్లకు కలిపి 50 లక్షల వరకు ఇన్సూరెన్స్ కూడా ప్రకటించింది. వలస కూలీలు, రోజువారీ కూలీలను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. వారికి ఆర్థిక సాయం అందిస్తామని కేంద్రం వెల్లడించింది. పేదల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేయాలని నిర్ణయించుకుంది. దేశ ప్రజలు ఎవరూ ఆకలితో ఉండకూడదు అనేది తమ విధానమని కేంద్రం స్పష్టం చేసింది. వచ్చే మూడుల నెలల పాటు ఉచితంగా రేషన్ అందజేయనున్నట్ట కేంద్రం తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more