pawan kalyan questions govt on farmers problems amid lockdown ఆక్వా, ఉద్యన రైతుల పరిస్థితులపై ప్రభుత్వానికి పట్టదా.?: పవన్ కల్యాణ్

Pawan kalyan questions govt on farmers problems amid lockdown

Coronavirus, Covid-19, lockdown, aqua farmers, construction labour, pawan kalyan, andhra pradesh, politics

janasena president pawan kalyan questions andhra pradesh government on the problems being faced by aqua farmers, construction feild registerd labour and non registered labour issues amid lockdown.

ఆక్వా, ఉద్యన రైతుల పరిస్థితులపై ప్రభుత్వానికి పట్టదా.?: పవన్ కల్యాణ్

Posted: 03/31/2020 03:56 PM IST
Pawan kalyan questions govt on farmers problems amid lockdown

తెలుగు రాష్టాల్లో కరోనా వైరస్ మహమ్మారిని ప్రారదోలడానికి రాష్ట్రప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకుసాగుతున్నాయి. తెలంగాణలో ఏప్రిల్ 7 తరువాత కరోనా వైరస్ కనుమరుగు అవుతుందన్న ప్రభుత్వ అంచనాలకు ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో ఏర్పాటు చేసిన మతప్రార్థనలు ఆటంకంగా మారాయి. ఇటు అంధ్రప్రదేశ్ లోనూ అంతంతమాత్రంగానే వున్న కరోనా వైరస్ బారిన పడినవారి గణంకాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఢిల్లీలోని మత ప్రార్థనలకు వెళ్లివచ్చినవారితో ఒక్కరోజులోనే 17 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరింత కఠినంగా నిర్ణయాలు తీసుకుంటోంది.

అయితే ప్రభుత్వ కఠిన నిర్ణయాలను స్వాగతిస్తూనే లాక్‌డౌన్‌ కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదర్కోంటున్న పలు వర్గాల ప్రజల సమస్యలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో అమలు జరుగుతున్న లాక్ డౌన్ నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులు, ఉద్యాన, ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ఆయన ఈ మేరకు ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో 21లక్షల మంది గుర్తింపు పొందిన భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని, మరో 30లక్షల మంది వరకు గుర్తింపు పొందని కూలీలు ఉన్నారని తెలిపారు. వీరితో పాటు ఉద్యాన, అక్వా రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

కేంద్ర కార్మికశాఖ మంత్రి .. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనాధికారులకు నిధులు విడుదల చేసేలా లేఖలు రాశారని ఈ సందర్భంగా పవన్‌ గుర్తు చేశారు. లాక్ డౌన్‌ కారణంగా రోజు వారీ కూలీలు తమ జీవనాధారాన్ని కోల్పోయారని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 17.62 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయని వివరించారు. ప్రస్తుతం ఉద్యాన పంటలు సాగుచేస్తున్న రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, ముఖ్యంగా అరటి రైతులు పంటను కోల్పోయే ప్రమాదముందన్నారు. ఆక్వా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వీరందరికీ న్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పవన్‌ కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Coronavirus  Covid-19  lockdown  aqua farmers  construction labour  pawan kalyan  andhra pradesh  politics  

Other Articles