కరోనా రక్కసి దేశంలోకి, తెలుగు రాష్ట్రాల్లోకి జొరబడకుండా ఉండి వుంటే ఇవాళ జరిగిన శ్రీరామ నవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా.. భక్తుల కన్నులపండువగా సాగివు ఉండేవి. వాడవాడనా ఉండే రామాలయాలు భక్తులతో కిటకిటలాడేవి. వేకుడ జామునుంచే దేశవ్యాప్తంగా రామాలయాల్లో శ్రీరామ నామస్మరణ మార్మోగేది. అన్ని దేవాలయాల్లో శ్రీసితారాముల జగత్కళ్యాణం జరిగేంది. అనంతరం వడపప్పు, పానకాలతో పాటు పలు దేవాలయాల్లో మధ్యాహ్నం అన్న ప్రసాదాల వితరణతో సందడిగా మారేవుండేది. కానీ ఈ మహమ్మారి కారణంగా.. ఎటువంటి ఆర్భాటాలు, సందడి లేకుండానే శ్రీరామ నవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
అలాగే కలియుగ వైకుంఠంగా ప్రతీతి చెందిన తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఉదయం సీతారామ లక్ష్మణులకు తిరుమంజనం నిర్వహించారు. నిత్యం భక్తజన సందోహం మధ్య సాగే ఈ వేడుకలకు ఈ సారి భక్తుల లేక కేవలం అర్చక బృందం మాత్రమే కదిలిరాగా ఈ సేవా కార్యక్రమాలు జరిగాయి. ఇకరాత్రి 10 గంటలకు బంగారు వాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థాన వేడుక నిర్వహించనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. రేపు రాత్రి 8 గంటలకు బంగారు వాకిలి చెంత శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. వైరస్ కలవరపెడుతుండడంతో ఈ వేడుకలన్నీ ఏకాంతంగానే నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.
భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణమహోత్సవం కన్నులపండువగా జరిగింది. లాక్డౌన్ ప్రభావంతో భక్తులకు ప్రవేశం లేకుండా కోవెల ప్రాంగణంలో నిరాడంబరంగా ఈ వేడుకను నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు రమణాచారి ఆలయ అర్చకులకు అందజేశారు. సుమారు 40 మంది సమక్షంలోనే జగత్కల్యాణాన్ని నిర్వహించారు. భక్తజనకోటి మధ్య జరగాల్సిన కార్యక్రమాలను ఇలా జరపించే విప్కతర పరిస్థితులు కల్పించావేమిటి రామా.? అంటూ అటు ఆర్చకులు, ఇటు భక్తులు.. శ్రీరామరక్ష సర్వజగధ్రక్ష అంటూ భారమంతా శ్రీరాములవారిపైనే వేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more