ప్రపంచవ్యాప్తంగా కదం తొక్కుతూ వేలాది మంది ప్రాణాలను కబళించిన కరోనా వైరస్ మహమ్మారి.. ఇటు భారత్ లోనూ పంజా విసిరింది. భారతీయులంతా దృడవిశ్వాసంతో ఎదుర్కోన్న నేపథ్యంలో ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ మర్కజ్ మసీదు ఆధ్వర్యంలో నిర్వహించిన తబ్లిగి జమాత్ మతకార్యక్రమాలలో పాల్గొనేందుకు వచ్చిన విదేశీయుల నుంచి కరోనా వైరస్ భారతీయులకు సోకింది. దేశం నలుమూలల నుంచి వేలాది మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో ఈ విషయాన్ని నిర్వాహకులు, హాజరైనవారు ఇద్దరు గోప్యంగా వుంచారు.
కాగా, తెలంగాణలో నమోదైన మరణాలతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక తెలంగాణలనూ ఈ మతప్రబోధనలకు హాజరైన వారి నుంచి ఇతతరులకు కూడా వ్యాధి సోకడంతో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ ఒక్కరోజే 75 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.ఈ మేరకు మంత్రి ఈటల రాజేందర్ ఓ ప్రకటన విడుదల చేశారు. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 229కి చేరింది. కరోనాతో ఈరోజు ఇద్దరు మృతిచెందారు. సికింద్రాబాద్, షాద్ నగర్‌కు చెందిన వ్యక్తులు మృతిచెందగా.. మృతుల సంఖ్య 11కి చేరింది.
మరోవైపు కరోనా సోకి కోలుకున్న వారిలో 15 మంది ఈరోజు డిశ్చార్జ్ అవగా.. ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 32కి చేరింది. ప్రస్తుతం ఐసోలేషన్ వార్డుల్లో 186 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఢిల్లీ మర్కజ్ వెళ్లొచ్చిన వారందరినీ గుర్తించినట్లు మంత్రి ఈటల తెలిపారు. మొత్తంగా 1130 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారని, అందులో 160 మంది ఎక్కడ వున్నారన్న విషయం తెలియరాలేదని.. కాగా తాజాగా వారందరినీ కూడా గుర్తించామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వారందరినీ ఐసోలేషన్ వార్డులకు తరలించామని.. యుద్ధప్రాతిపదికన కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more