కరోనా భయంతో అల్లాడుతున్న ఉద్యోగులకు, చిన్నసంస్థలకు, పేద, బీద, రైతులు, డ్వాక్రా సంఘాలు, వృద్దులు, వితంతువులు, వికలాంగుల కోసం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం.. దానిని ఇవాళ్టి నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. కరోనా వైరస్ మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మరణాలను దృష్టిలో పెట్టుకున్న కేంద్రం.. దేశవ్యాప్తంగా లాక్ డైన్ విధించింది. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు, బీదలు, కూలీలు, భవన నిర్మాణ కార్మిలు, డ్వాక్రా సంఘాలు, రైతులు ఇలా అన్నివర్గాల వారికి కేంద్రం తమ ఉద్దీపనలో భాగంగా నగదు సాయం చేయాలని సంకల్పించింది.
‘ప్రధాన మంత్రి జన్ ధన్’ నగదు బదిలీ పథకంలో భాగంగా మొదటి రోజు నాలుగు కోట్ల మహిళల ఖాతాల్లో రూ. 500 చొప్పున జమ చేశారు. ఈ పథకంలో ఏ ఒక్క లబ్దిదారు నష్టపోకుండా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని జన్ ధన్ అకౌంట్లను పున: ప్రారంభించాలని బ్యాంకులను కేంద్రం ఆదేశించింది. తొమ్మిదో తేదీలోపు ఈ నగదు బదిలీ ప్రక్రియ పూర్తి కానుంది. అన్ని ఖాతాల్లోకి ప్రభుత్వం అందిస్తున్న మొత్తం చేరనుంది. దేశంలోని పేదలకు అందజేస్తున్న ఈ ఉద్దీపనను ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ పేరుతో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
లాక్డౌన్ రిలీఫ్ ప్యాకేజీలో భాగంగా పేదలకు మూడు నెలలకు గాను మూడు వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని కేంద్రం చెప్పింది. ఇందులో భాగంగా ఏప్రిల్ నెలకు సంబంధించిన నగదు బదిలీ ప్రక్రియ కూడా మొదలైంది. రాష్ట్రాల ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోలియం సంస్థలు మే, జూన్ నెలల్లో నాలుగో తేదీలోగా నగదు బదిలీ చేయనున్నాయి. ‘ఉజ్వల’ లబ్దిదారులు మూడు 14.2 కిలోల గ్యాస్ రీఫిల్స్‌ను గానీ, ఎనిమిది కిలోల ఐదు గ్యాస్ సిలిండర్లను గానీ ఎంచుకొనే సౌలభ్యం ఉంది.
ఒకవేళ జూన్ వరకు 3 సిలిండర్లను ఉపయోగించకపోతే.. నగదు బదిలీ కింద తమ ఖాతాలోకి వచ్చిన డబ్బుతో వచ్చే ఏడాది మార్చి వరకూ గ్యాస్ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఓవరాల్ సరఫరా రేటు దెబ్బ తినకుండా ‘ఉజ్వల’ లబ్ధిదారులకు ఉచిత ఎల్పీజీ సిలిండర్లను అందించాలని ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ కంపెనీలను కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. ఈ మూడు ప్రభుత్వ రంగ సంస్థలు రోజుకు 60 లక్షల సిలిండర్లను డెలివరీ చేస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more