Telangana govt credits Rs 1500 each in 74 lakh bank accounts తెల్ల రేషన్ కార్డుదారుల బ్యాంకు అకౌంట్లలో రూ.1500 జమ

Corona financial aid telangana credits rs 1 500 each in 74 lakh bank accounts

Coronavirus financial aid, 1500 rupees in 74 lakh bank accounts, telangana direct cash transfer scheme, cash tranfer, telangana aid during lockdown, coronavirus, coronavirus in Telangana, Telangana coronavirus cases, coronavirus cases in Telangana, coronavirus count in india, india coronavirus count, Tabilghi Jamat Telangana, Tabilghi jamat Telangana cases, Nizamudding event Telangana,

The Telangana government on Tuesday credited Rs 1,500 each in over 74 lakh bank accounts towards the financial assistance to poor families during coronavirus induced lockdown. State cabinet minister K.T. Rama Rao said the government transferred Rs 1,112 crores to banks for this programme.

తెల్ల రేషన్ కార్డుదారుల బ్యాంకు అకౌంట్లలో రూ.1500 జమ

Posted: 04/14/2020 07:53 PM IST
Corona financial aid telangana credits rs 1 500 each in 74 lakh bank accounts

కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో పేదల అనేక అవస్థలు పడుతున్నారని గ్రహించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెల్ల రేషన్ కార్డుదారుల బ్యాంకు అకౌంట్లలో రూ.1500 వేస్తామని గత నెలలో ప్రకటన చేశారు. రాష్ట్రానికి రావాల్సిన అన్ని ఆదాయవనరులు దారులన్నీ ముగిసిపోయినా.. పేదలకు అండగా వుంటామని ప్రకటించిన ముఖ్యమంత్రి.. పేదల కోసం ప్రభుత్వ ఖజానాలోంచి డబ్బులు విడుదల చేశారు. ఇక ఏకంగా 74 లక్షల తెల్లరేషన్ కార్డుదారులకు బ్యాంకు అకౌంట్లలోకి ఆ డబ్బులు జమ అయ్యాయి.

లాక్ డౌన్ తో దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు కొద్దిమేర ఊరట కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం నగదు బదిలీ చేయాలని నిర్ణయించింది.  ఇ:దుకోసం ఇవాళ 74 లక్షలకు పైగా బ్యాంకు ఖాతాలకు రూ.1500 చొప్పున నగదు బదిలీ చేశామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. లాక్ డౌన్ కారణంగా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించిన మేర ఈ ఆర్థిక సాయం అందిస్తున్నామని వివరించారు. అందుకోసం మొత్తం రూ.1,112 కోట్లు కేటాయించిన్నట్టు కేటీఆర్ చెప్పారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం నుంచి ఆయా బ్యాంకులకు బదిలీ చేశామని తెలిపారు. ఇక రాష్ట్రంలో 87శాతం మందికి బియ్యం పంఫిణీ కూడా చేశామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles