కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రభుత్వాలు, అధికారులు, పోలీసులు విన్నవిస్తున్నా ఆ విన్నపాలను తమకు వర్తించవన్నట్లు వ్యవహరించే పలువురు మాత్రం యథేచ్ఛగా రోడ్లపైకి వస్తున్నారు. పలు ప్రాంతాల్లో పోలీసులు వీరిపై లాఠీలు జుళిపించారు. కొన్ని చోట్లు మోకాళ్లపై నిలబడి దండాలు పెట్టి చెప్పారు. తమకు తోచిన విధంగా పోలీసులు సామ, దాన బేద, దండోపాయాలను వినియోగించినా.. నిబంధనలు ఉల్లంఘించే వారి సంఖ్య పెరుగుతూనే వుంది. దీంతో కఠినంగా వ్యవహరించినప్పటికీ మార్పు రాకపోవడంతో పోలీసులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది.
ముఖ్యంగా కరోనా ప్రభావం అధికంగా వున్న ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించే వారి సంఖ్య అధికం అవుతోంది. పోలీసులు ఫ్రిగా లాఠీలతో టాటూలు వేసినా.. ఉల్లంఘించేవారు వేరే మార్గాల గుండా పయనిస్తూ.. వారి నుంచి తప్పించుకుంటున్నారు. దీంతో ఎంత కఠినతరం చేసినా ఉల్లంఘనలకు పాల్పడే వారి సంఖ్య మాత్రం తగ్గకపోవడంతో పోలీసులు తాజాగా ఒక తరుణోపాయం అవలంభించారు. తాజాగా తమిళనాడులోని తిరుపూర్‌లో ఏ పనీ లేకుండా అనవసరంగా రోడ్లపైకి వచ్చిన యువకులను స్థానిక పోలీసులు వినూత్నంగా భయపెట్టారు. ఓ వ్యక్తికి కరోనా పేషెంట్ మాదిరిగా దుస్తులు వేసి అంబులెన్స్‌లో పడుకోబెట్టారు.
నిబంధనలు ఉల్లంఘించి రహదారిపైకి వచ్చిన యువకులను బలవంతంగా ఆ అంబులెన్స్‌లోకి ఎక్కించారు. దీంతో లోపలి వ్యక్తిని కరోనా బాధితుడిగా భావించి భయపడిన సదరు యువకులు అంబులెన్స్ నుంచి బయటపడేందుకు పడిన తంటాలు పలువురికి నవ్వు తెప్పిస్తున్నాయి. ఆకతాయిలను కొట్టకుండా ఇలా పోలీసులు తీసుకున్న నిర్ణయంపై పలువురి నుంచి ప్రశంసలు వస్తుంటే, ‘భయపడి జరగరానిది జరిగితే బాధ్యులు ఎవరు?’ మరికొందరు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఇందుకు ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
TN police putting lockdown violators in ambulance having fake coronavirus patient to make them realise their mistakepic.twitter.com/OcePgZRLcR
— babu bisleri (@AakashKaSunapun) April 24, 2020
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more